50 మంది గర్భిణీ స్త్రీలకు వేడుకగా శ్రీమంతం చేసిన వాసవి క్లబ్. కే సి జి ఎఫ్ వైజాగ్ ఫెమినా క్లబ్ అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకుశ్రీమంతాలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి జిల్లా అధ్యక్షురాలు మానస పాల్గొని ఆశీర్వదించారు. .

50 మంది గర్భిణీ స్త్రీలకు సీమంత0 వేడుకలు. - విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ఫోన్ నెంబర్. సెల్. 9502817542) --------------------------------. 50 మంది మహిళలకు వాసవి క్లబ్, కె.సి జి.ఎఫ్.వైజాగ్ ఫెమి
నా క్లబ్ అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో ఘనంగా గర్భణీ స్త్రీలకు చీర,సారి,పుట్టబోయే శిశువులకు 20 వేలు రూపాయలు ఖరీదు చేసే అవసరమైన సామగ్రిని అందచేసారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసవి జిల్లా ప్రధమ మహిళ మానస మాట్లాడుతూ ఫెమినా క్లబ్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాలు మిగిలిన వారికి మంచి స్ఫూర్తిని కలిగిస్తాయని ఈ కార్యక్రమానికి విచ్చేసిన గర్భణీ స్త్రీలను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ అమర్నాధ్, కార్యదర్శి సాయి నిర్మల,కోశాధికారి చెరుకు కృష్ణ ప్రాంతీయ అధికారి పద్మావతి, జోనల్ అధికారి సుజనా,సభ్యులు నిరుపమ,శ్రీలక్ష్మి , రోజా రమణి,సత్యలక్ష్మి,మంగామణి,సావిత్రి తదితరులు పాల్గున్నారు.