ప్రజా సమస్యలపై జీవీఎంసీ కమీషనర్ మేయర్ కు వినతిపత్రం అందజేసిన 5వ వార్డ్ కార్పొరేటర్ హేమలత. ఆమె తండ్రి లక్ష్మణరావు.

భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) *ఐదవ వార్డ్ లో వీధి లైట్లు,త్రాగునీరు సమస్యను వెంటనే పరిష్కరించా లి* *ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(PGRS) లో జీవీఎంసీ మేయర్, కమిషనర్లకు వినతిపత్రం అందజేత.* *_కార్పొరేటర్ మొల్లి హేమలత_* *మధురవాడ* : వార్డు లో వీధిలైట్లు,త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని 5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఈరోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక"(Public Grievance Redressal System) లో మేయర్ పీలా శ్రీనివాసరావు, నూతన కమిషనర్ కేతన్ గార్గ్ లకు వినతి పత్రం అందజేశారు. వార్డులో వీధిలైట్ల సమస్య చాలా ఎక్కువగా ఉందని ముఖ్యంగా క్రొత్తగా ఏర్పడిన కాలనీలు అయినా jnnurm pp1,Pp 2 మరియు ఎన్టీఆర్ హుదూద్ కాలనీలలో వీధిలైట్లు సమస్య వలన అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కావున త్వరితగతిన కొత్త వీధిలైట్లు మంజూరు చేయాలని, వార్డు లో గల ప్రధాన కూడలిలలో రింగ్ పోల్ లైట్లు వేయవలసిన అవసరం ఉందని కావున 10 రింగ్ టోన్ లైట్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. అయ్యప్ప నగర్ అమృత త్రాగునీటి ప్రాజెక్టు లో భాగంగా ఇంకా కార్పెంటర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, వివేకానంద కాలనీలలో పైపులైన్లు వేయవలసి ఉందని అవి వెంటనే పూర్తి చేయాలని, వార్డులో ప్రజల త్రాగునీటి అవసరాల దృష్ట్యా 15 చేతి పంపు బోర్లును త్వరితగతిన మంజూరు చేయాలని, మారికవలస నుండి ఓజోన్ వ్యాలీ కాలనీకి వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని, స్వతంత్ర నగర్,బొట్టవానిపాలెం,వికలాంగుల కాలనీ తదితర ప్రాంతాలలో దశాబ్దాల క్రితం వేసిన కాలువలు, రోడ్లు పూర్తిగా పాడైపోయాయని కావున వెంటనే అవి పునర్మించాలని వినతిపత్రం ద్వారా మేయర్ కమిషనర్లకు తెలియజేయడం జరిగిందని అన్నారు. మేయర్, కమిషనర్లు సానుకూలంగా స్పందించి వార్డు సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు.