మధురవాడలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు... పలు సేవా కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు, ప్రార్థనలు. షిరిడి సాయి సత్య సాయి ఆలయాలలో మార్మోగిన భజనలు.
July 10, 2025
విశాఖ సిటీ,మధురవాడ,, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) మధురవాడ పరిసర ప్రాంతాలలో పలు ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పీఎం పాలెం సత్య సాయి ప్రేమాలయం, ఏయూ టీచర్స్ లేఔట్ షిరిడి సాయి ఆలయం, స్వతంత్ర నగర్ షిరిడి సాయి పెద్ద చిన్న ఆలయాలలో, మిథిలాపురి కాలనీ, పీఎం పాలెం చివర బస్టాప్ మామిడి తోట ఎల్ఐ జి లో వెలసిన షిరిడి సాయి ఆలయంలో, ఎం వివి సిటీలో సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో, మిథిలాపురి కాలనీ శివాలయం, ఆర్టీసీ కాలనీ శిరిడి సాయి ఆలయం, ప్రాంగణంలో ఉన్న శిరిడి సాయి ఆలయంలో, మధురవాడ సత్యసాయి ఆలయం పలు దేవాలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో వేలాదిమంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తితో భజనలు చేశారు..