చంద్రంపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం 50 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నలు, పెన్సిల్స్ ఇతర సామాగ్రి ఒక్కొక్కరికి ఒక కిట్. సత్య సాయి విభూది, ఫొటోస్ ఎం వి వి సిటీ సత్య సాయి సెంటర్ ఆధ్వర్యంలో అందజేశారు.. రెండు రోజుల్లో మొత్తం 100 కిట్లు ఇచ్చారు.
July 23, 2025
ఓం శ్రీసాయిరాం
ఏ.పీ. విశాఖపట్నం జిల్లా.
ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: ఎం. వి.వి.సిటీ. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.
భగవాన్ శ్రీసత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి
(💯 వ) శతజయంతోత్సవ ఉత్సవములలో భాగంగా ఎంవీవీ సిటీ శ్రీ సత్య సాయి సెంటర్ తలపెట్టిన సేవ కార్యక్రమంలలో భాగంగా 💯 మంది నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్5 మరియు ఒక పెన్ను ,రెండు పెన్సిల్స్, ఎరేజర్ , స్కేల్, షార్పనర్, బిస్కెట్లు, చాక్లెట్లు ,పళ్లీ చెక్కి, స్వామివారి పాకెట్ క్యాలెండర్, విభూది ఒక కిట్ గా చేసి
తేదీ 23.07.2025 బుధవారం నాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చంద్రంపాలెం చిన్న గదిలి (మండలం) లో ఉన్న సుమారు 50 మంది పేద విద్యార్థులకు పుస్తకముల మరియు ఇతర సామాగ్రి పంపిణీ జరిగినది
ఈ కార్యక్రమంలో సాయి సెంటర్ నిర్వాహకులు టంకాల జ్యోతి శివాజీ , నాగ వేణి వెంకట రామకృష్ణరావు , పీఎం పాలెం సమితి కన్వీనర్ ప్రభాకర్ గారు, సేవాదళ్ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.