త్రిశక్తి దేవాలయంలో అమావాస్య ప్రత్యేకపూజలు

త్రిశక్తి దేవాలయంలో అమావాస్య ప్రత్యేక పూజలు! మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) విశాఖపట్నం జిల్లా మధురవాడ మూడు గుళ్ళు జంక్షన్ (కొమ్మాది జంక్షన్) కొలువై ఉన్న శ్రీబంగారమ్మ, శ్రీఎర్నమ్మ, శ్రీదండుమారమ్మ అమ్మవారి ఆలయంలో (త్రిశక్తి దేవాలయంలో) ప్రతీ అమావాస్యకి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, గురువారం సాయంత్రం అమావాస్య సందర్భంగా అమ్మవార్లకు పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిష్ఠల రాంబాబు శర్మ తదితరులు జరిపించారు, పుజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వాండ్రాసి సన్యాసిరావు, పిళ్లా సూరిబాబు, యమ్. గణపతిరావు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.