చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేసవి దాహార్తిని తీర్చే మజ్జిగ చలివేంద్రం ముగింపు. దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. ధాతలకు ఘన సన్మానం.

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయం వద్ద ఉన్న వేసవి చలివేంద్రం మజ్జిగ పంపిణీ విజయవంతంగా ముగింపు. మధురవాడ,.(
ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ). చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆలయ కమిటీ సభ్యులు, చంద్రంపాలెం పెద్దలు, దాతలు , భక్తులు పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పి.యం.పాలెం మాసం అందరి సహకారంతో ఈ సంవత్సరం మార్చి నెల ఆఖరు నుండి నేటి వరకు సుమారు యాభై నుండి అరవై పర్యాయాలు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది, మార్చి నెల నుండి ఈరోజు వరకు ఎండలు ఎక్కువగా ఉండి, ఉక్కపోత దారుణంగా ఉండడం వలన జనాలు ఎండ వేడిమికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో ఎండతో రోడ్లపై వాహనాల్లో ప్రయాణం చేసేవారికి, బాటసారులకు , శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులకు కొంత ఉపశమనం కలిగించడం కోసం సుమారు మూడున్నర నెలలు చల్లని మంచినీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని శ్రీదుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు అన్నారు, ముఖ్యంగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి అన్నీ విధాల సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు, చంద్రంపాలెం గ్రామ పెద్దలకు, దాతలకు, భక్తులకు, పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు, చలివేంద్రం ముగింపు సందర్భంగా మధురవాడ వాస్తవ్యులు బార్లd సుధీర్ కుమార్, స్వప్న దంపతులు సహాయ సహకారాలతోమజ్జిగ పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, సభ్యులు గూడేల రాజు, బోగవిల్లి రాము, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పీస రామారావు, ఆలయ అర్చకులు పట్నాల మూర్తి శర్మ, ముఖ్య సభ్యులు పిళ్లా అప్పన్న, బొల్లు అప్పారావు, పోతిన రాంబాబు, పొట్నూరి వాసు, సుందర శ్రీను మరియు పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కె.వి.నాగేశ్వరరావు, సభ్యులు కానూరి శ్రీరాములు, సభ్యులు సోర్నంపూడి గణేష్, బడిగంటి పాండురంగ విఠల్, యన్. షణ్మఖరావు ఇమంది నాగేశ్వరరావు ఉద్దండం శ్రీనివాసరావు, తీడ తులసి రామ్, కె.శ్రీధర్, పాల్గొన్నారు. మూడు నెలలు పాటు ఆలయ ఆవరణలో చలివేంద్రంలో మజ్జిగ పంపిణీకి సహకరించిన పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పి.యం.పాలెం అధ్యక్షులు కె.నాగేశ్వరరావు కి సంఘ సభ్యులకు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు,