పాక్షికంగా నిర్మించి వదిలేసిన కళ్యాణమండపానికి తిరిగి నిర్మాణ పనులు చేపట్టేందుకు80.40 లక్షలు వ్యయంతో సాయిరాం కాలనీలోశంకుస్థాపన చేసిన 5వ వార్డు కార్పొరేటర్ హేమలత.

అసంపూర్తిగా నిర్మితమై ఉన్న కళ్యాణ మండపానికి నిధులు మంజూరు. 80.40లక్షల వ్యయంతో కళ్యాణ మండపం పునః ప్రారంభ పనులుకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత. మధురవాడ: ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మనం శ్రీను.) జీవీఎంసీ జోన్-2 పరిధి 5వ వార్డు సాయిరాంకాలనీ ఫేస్-3 లో అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపాన్నీ 80.40లక్షల వ్యయంతో పునః ప్రారంభ పనులకు ఆదివారం కార్పొరేటర్ మొల్లి హేమలత శంకుస్థాపన చేశారు.స్థానిక ప్రజల అవసరార్థం నిర్మిస్తున్న ఈ కళ్యాణమండపం పూర్తయితే తమ అవసరాలకు శుభకార్యాలకు ఎండా,వాన నుండి తమ కష్టాలు గట్టెకుతాయని సాయిరాం కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కళ్యాణ మండపం పనులు ప్రారంభం కావడంతో శాసనసభ్యులు గంటాకు, కార్పొరేటర్ మొల్లి హేమలతకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం 5వ వార్డ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్ మొల్లి హేమలత పరిశీలించారు.ఈసందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ... గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ కళ్యాణ మండపం పనులు ప్రారంభించి కొంతమేర పనులు చేపట్టడం జరిగిందని, అనంతరం వచ్చిన వైసిపి ప్రభుత్వంలో ఈ కళ్యాణ మండపానికి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదని, నేను కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత జరిగిన అన్ని కౌన్సిల్ సమావేశాల్లో ఈ అసంపూర్తిగా ఉన్న కల్యాణ మండపానికి నిధులు మంజూరు చేయాలని పలుమార్లు అడగడం జరిగిందని, చాలాసార్లు మేయర్ జీవీఎంసీ కమిషనర్లకు చాలా సార్లు వినతి పత్రాలు రూపంలో కూడా తెలియజేశామని, గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సహకారంతో వార్డులో గల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారమార్గం దొరికిందని,ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కళ్యాణ మండపాలు,రోడ్లు,కల్వట్లు, మెట్ల మార్గాలు, పార్కులు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పనులను పర్యవేక్షించి ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా రాకపోకలకు అణువుగా నాణ్యతాలోపం లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తయిదారులకు తెలియజేయడం జరిగిందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాశి అప్పలరాజు,కొండపు రాజు,బొడ్డేపల్లి రంగారావు, ఆవాల నీలయ్య,పాపారావు, యోగేశ్వరరావు , జగన్నాథం, ఆవాల నారాయణరావు, కొల్లి దేవి ,దువ్వు రమణ, మోహన్, ఓలేటి శ్రావణ్, జ్యోజిబాబు, రాజు కాలనీ మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.