స్వామి సత్య సాయి ఆశయ సాధనకై యువత నడుం బిగించాలి. స్వామి శత జన్మదినోత్సవాలను విజయవంతం చేయాలి. ఆర్త జనోద్దరణ సేవలో విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల . అధ్యక్షులు పి ఆర్ ఎస్ నాయుడు పిలుపు.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ.) శ్రీ సత్య సాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా యువజన విభాగం 📍 తేదీ: 06 జూలై 2025 *ఆర్త జనోద్ధరణ సేవ – మానవత్వం పరిమళించిన మహోన్నత ఘట్టం* భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, "ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న" అనే ఆయన దివ్యోపదేశాన్ని శిరోధార్యంగా తీసుకుని, శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖపట్నం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో "ఆర్త జనోద్ధరణ సేవ" పేరుతో ఓ విశిష్టమైన సేవా కార్యక్రమం ఆదివారం జ్ఞానాపురం రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సమితుల నుండి వచ్చిన 180 మంది శ్రీ సత్య సాయి యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి ముందు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో మానసికంగా వెనుకబడినవారు, నిరాశ్రయులు ఎవరున్నారో గుర్తించే విశేష సర్వే నిర్వహించారు. అనంతరం, బాధితులను గౌరవంగా సేవా స్థలానికి తీసుకువచ్చి, స్వయంగా శ్రమించి షేవింగ్ చేయడం, జుట్టు కత్తిరించడం, వెచ్చని నీటితో స్నానం చేయించడం, శుభ్రమైన దుస్తులు ధరింపజేయడం, గాయాలపై మందులు స్వయంగా వ్రాయడం వంటి సేవలను ప్రేమతో, ఆదరణతో అందించారు. చివరగా, ఆరోగ్యకరమైన భోజనాన్ని నిరాశ్రయులకు అందజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సేవా సంస్కృతిని ప్రతిబింబించే యువత – సాయి సంస్థల బలమైన మూలస్తంభం" అని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవ అనే స్వామి సూచించే మార్గంలో యువత ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. సత్యసాయి ఆశయ సాధన కోసం మనమంతా ఐక్యంగా పనిచేయాలని సేవ చేస్తే సేవ్ చేస్తానని, స్వామి చెప్పారని, అది స్వామి చేసి చూపించారని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి యువత చేస్తున్న స్వచ్ఛంద సేవను ఆయన అభినందించారు. ఈ సేవా కార్యక్రమాన్ని శ్రీ సాయి ప్రశాంత్, శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా యువజన సమన్వయకర్త (పురుషులు), శ్రీ మణికంఠ, జాయింట్ యువజన సమన్వయకర్త సమర్థంగా సమన్వయం చేశారు. విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల ,శ్రీ సత్యసాయి సేవా సమితుల, భజన మండళ్ల కన్వీనర్లు, ఇతర పదాధికారులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని ఈ మానవతా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.