చంద్రంపాలెం దుర్గాలమ్మ, జాతర గట్టుపై వెలసియున్న షిరిడి సాయి ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, సాయి రాముడి భజనలు.
July 10, 2025
జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయంలో సాయిబాబా వారి గురు పౌర్ణమి వేడుకలు
(విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు
శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈశాన్య భాగం ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి,
సాయి నాధునికి సుప్రభాత సేవ నిత్య అర్చనలతో ప్రారంభమై పంచామృత సుగంధ జాలాభిషేకం, పాలాభిషేకం, అన్నాభిషేకం జరిపించారు, మధ్యాహ్నం హారతి బాబా గారికి ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, శంకర స్వామి తదితరులు సమర్పించారు, భక్తులకు తీర్ద ప్రసాదాలు అందజేశారు,
ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు, సహాయ సహకారాలతో ఆలయ ప్రాంగణంలో అన్నసంతర్పణ చేపట్టారు, అన్న సంతర్పణలో సుమారు నాలుగు వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు,
ఈ సందర్భంగా మధురవాడ రాగ మ్యూజిక్ అకాడమీ నాగజ్యోతి బృందం వారిచే భక్తి గీతాల ఆలాపన కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిళ్లా రమణ మూర్తి, ఆలయ ధర్మకర్త పిళ్ళా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్ళా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, జాయింట్ సెక్రటరీ పిళ్ళా మోహన్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, సభ్యులు పిళ్ళా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పిళ్ళా రమణ, గూడెల రాజు, బైపిల్లి సురేష్, మరుపిల్లి ఆనంద్, భోగవిల్లి రాము, కేశనకుర్తి అప్పారావు,
చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్ళా శ్రీనివాసరావు, పీస రామారావు, బి.సత్యనారాయణ, జగుపిల్లి నాని, పి.సత్యనారాయణ, భోగవిల్లి నాని,
ముఖ్య సభ్యులు పిళ్ళా పోతరాజు, పిళ్లా అప్పారావు, పి.వెంకటరమణ, పిళ్ళా అప్పన్న, యమ్.వెంకటరావు, పి.సూరి పాత్రుడు, పోతిన కనకరావు, పొట్నూరి వాసు, పిళ్లా రాజు, ఎస్.శ్రీను, మరియు చంద్రంపాలెం యూత్ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.