గిరి ప్రదర్శన భక్తులకు ప్రసాదం వితరణ ఎం.వి.పి. . వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న భక్తులకు సేవ.
July 09, 2025
విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి. వాసవి క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థంw *సింహాచలం గిరి ప్రదక్షణ* చేయు భక్తులకు తేదీ 09.07.2025 బుధవారం ప్రసాద వితరణ కార్యక్రమము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్
వి 201ఏ గవర్నర్
శ్రీ తమ్మన అమర్నాథ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసాద వితరణ ప్రారంభించినారు. తదనంతరం గవర్నర్ గారికి కండువాతో సత్కరించడం జరిగినది. గిరి ప్రదక్షిణ చేస్తున్న సుమారు 15,000 మంది భక్తులకు పైబడి టీ,పకోడీ, బిస్కెట్స్, బన్స్, డ్రింక్స్ ,తీపి బూంది వితరణ సాయంత్రం ఐదు గంటల మొదలుకొని అర్ధరాత్రి వరకు పంపిణీ ఎంవిపి కాలనీ సెక్టర్ 7, కెనరా బ్యాంక్ బిల్డింగ్ (జామి ఫంక్షన్ హాల్ )ఎదురుగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్, గ్రంధి వాసుదేవ మూర్తి గారు, ఐ ఆర్ కె ప్రసాద్ గారు, శివరామకృష్ణ, గ్రంధి కృష్ణారావు, హరగోపాల్, నరసింగరావు మరియు అధిక సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు