విశాఖ సిటీ, పీ.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ పరిధి మారికవలస జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి.
July 17, 2025
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి.
విశాఖ సిటీ,మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్.: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
మారికవలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.. గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటు తుండగా ఆ వ్యక్తిని మిక్సర్ లారీ డీకొనటం తో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటనలో మృత దేహం తలభాగం నుజ్జు నుజ్జు అవ్వడంతో పోలిక లేకుండా అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్కు అంతరాయం కలవకుండా నియంత్రణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీఎం పాలెం పోలీసులు కేజీహెచ్ తరలించారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.