కార్ షెడ్ జంక్షన్ పీఎం పాలెం వెళ్లే సింగల్ రోడ్డులో అక్రమ నిర్మాణం. జమీందారులను అడ్డేది ఎవరు? అక్రమ నిర్మాణాలతోనే నిండిపోయిన కార్ షెడ్ జంక్షన్. ఇప్పటికే ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం. తూట్లు పొడుస్తున్న ప్రణాళిక విభాగం.
July 19, 2025
.కార్ షెడ్ కూడలి లో ... జమీందారుల హవ. అడ్డేది ఎవరు? ఆపేది ఎవరు?
అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్ నిర్మాణం.
ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :సీనియర్ జర్నలిస్ట్ (మానం శ్రీను)
చోద్యం చూస్తున్న జీవీఎంసీ జోన్-2 పట్టణ ప్రణాళిక అధికారులు.
మధురవాడ: ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ
.
టౌన్ ప్లానింగ్ అధికారులఅనుమతి తీసుకోకుండా కార్ షెడ్ కూడలి బబేళమ్మ గుడి ఎదురుగా (పిజ్జాహట్ ప్రక్కన)భారీ షెడ్ నిర్మాణం.. జివిఎంసి జోన్-2 ప్లానింగ్ అధికారుల పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.వి.ఎల్.టి.లేకుండా కమర్షియల్ భారీ షెడ్ నిర్మాణంకు అనుమతులు తీసుకోకుండా కడుతున్నారని స్థానిక ప్రజలు వివిధ పత్రికలలో వస్తున్న కథనాలకు స్పందించని
జోన్ -2 టౌన్ ప్లానింగ్ అధికారులు,సిబ్బంది.
జీవీఎంసీ కి లక్షలలో వి.ఎల్.టి. సతగోపం పెట్టి అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్ నిర్మిస్తున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం, జోన్- 2 టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ స్థానిక సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ తదితరులు గాని ఈ షెడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు తూ తూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేయడం సర్వసాధారణం అయిపోయింది.