. v201A జిల్లా 3వ క్యాబినెట్ సమావేశం. 200 రోజుల్లో ఒక కోటి 22 లక్షల విలువ చేసే ప్రజాసేవ. ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు రామకృష్ణ కి న్యూస్ కవరేజ్ ఛాంపియన్ అవార్డ్ . అందించిన ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్య ప్రకాష్.
July 19, 2025
200 రోజుల్లో ఒక కోటి 22 లక్షల రూపాయలు విలువ చేసే సేవ.. వాసవి క్లబ్లను ప్రశంసించిన-- ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, వాసవి ఎన్ సేవా సంకల్ప కె సి జి ఎఫ్ శ్రీ సిద్ధ సూర్య ప్రకాష్.--- ఎంవిపి వాసవి క్లబ్ కపుల్ అధ్యక్షుడు రామకృష్ణకి న్యూస్ కవరేజ్ అవార్డ్.
విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
విశాఖపట్నం V201A జిల్లా 3వ క్యాబినెట్ సమావేశం, తోపాటు 2025 వ సంవత్సరంలో 200 రోజులు పూర్తి చేసు కున్న సందర్భంగా స్థానిక ప్రభుత్వ గ్రంథాలయంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన వాసవియన్ సేవాసంకల్ప
కే సి జి ఎఫ్ శ్రీ సిద్ధ సూర్య ప్రకాష్, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విశాఖపట్నం జిల్లా లో ఉన్న అన్ని వాసవి క్లబ్ లు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి మాట్లాడుతూ
200 రోజుల్లో ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు విలువచేసే సేవా కార్యక్రమములు చేయటం చాలా సంతోషకరం, అభినందనీయం అని, ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఇన్ని సేవా కార్యక్రమాలు జరగలేదని, జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్ కృషి వల్ల , జిల్లా టీం సహకారంతో కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిగాయని కొనియాడారు. 200 రోజులు పూర్తి అయిన శుభ సందర్భంలో ముఖ్యఅతిథి కేక్ కట్ చేసి, మిడ్ ఇయర్ అవార్డులు అందజేశారు..అందులో భాగంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ చేసిన కార్యక్రమాలు వెను వెంటనే న్యూస్ కవరేజ్ చేసి జిల్లా ఆఫీసు కు తెలియజేయడం అభినందనీయమని గవర్నర్ తెలియజేస్తూ న్యూస్ కవరేజ్ ఛాంపియన్ అవార్డు ఎంవిపి కపుల్స్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణారావుకు ముఖ్యఅతిథి చేతులమీదుగా అందజేసినారు.ఈ అవార్డు మా క్లబ్ కు రావటం చాలా ఆనందదాయకమని ఇలాంటి అవార్డ్లు ఇంకనూ ఎన్నో పొందాలని దానికి మన క్లబ్ సభ్యులు సహకారం ఎంతో అవసరం ఉందని రామకృష్ణారావు తెలుపుతూ, గవర్నర్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు, క్లబ్ సభ్యులు అందరికీ ధన్యవాదములు తెలియజేశారు.