శ్రీ శ్రీ శ్రీసీతారామ సాగర లింగేశ్వర ఆలయంలో వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆలయ కమిటీ రామకృష్ణ అధ్యక్షతన శ్రమదాతల సహాయ సహకారములతో నిర్మాణమైన అర్చక నివాసాన్ని ప్రారంభోత్సవం చేసిన వాసవి జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్.

వాసవిక్లబ్ చే ఆలయం లో అర్చక నివాసం ఏర్పాటు. విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
మూలపాలెం అప్పుఘర్ శ్రీశ్రీశ్రీ సీతారామ సాగర లింగేశ్వర ఆలయం లో వాసవి క్లబ్,ఏం.వి.పి. కపుల్స్,ఆలయ కమిటీ సభ్యులు, శ్రమ దాతల సహాయ సహకారములతో ఏర్పాటైన "అర్చక నివాసాన్ని" వాసవి జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ సభ్యులు ముందు ఉంటారని జిల్లాలో 70 క్లబ్బులు ఉన్నాయని సభ్యత్వ సంఖ్య 5,000 అని ఈ సంవత్సరం జనవరి నుంచి నేటి వరకు ఒక కోటి 75 లక్షల విలువ చేసే సేవా కార్యక్రమాలు అన్ని క్లబ్బుల ద్వారా నిర్వహించినట్లు దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. దాతలైన జిల్లా కోశాధికారి చెరుకు కృష్ణ, కృష్ణకుమారి, కాపుగంటి గోపాలకృష్ణారావు ను అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పులవర్తి రమేష్,తిరుపతిరావు,కమల్ కుమార్ ,పుష్పలత క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణారావు, ప్రధమ మహిళ నాగవేణి,కార్యదర్శి రమణ మూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, కార్యక్రమాల అధ్యక్షుడు శివరామకృష్ణ ,ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు సభ్యులు నరసింగరావు ,మల్లేశ్వర గుప్తా,మానస,మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, స్వాతి తదితరులు పాల్గొన్నారు