విశాఖ జిల్లా మధురవాడ పిఎసిఎస్ డైరెక్టర్ గా పోతిన తిరుమలరావు భార్య మీనాక్షి....... మెగాస్టార్ చిరంజీవి కుటుంబం పట్ల ప్రజారాజ్యంతొలి నా ల నుంచి తిరుమల రావుకు ఎనలేని అభిమానం.. ఆ అభిమానమే ఆయన్ను జనసేనలోకి దించింది. తనకు న్యాయం చేసిన జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భీమిలి జనసేన ఇంచార్జ్ సందీప్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు.
July 31, 2025
భీమిలి నియోజకవర్గం ఎండాడ,
ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను. మధురవాడ)
భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎసిఎస్ డైరెక్టర్ గా పోతిన మీనాక్షిని నియమించడం పట్ల భీమిలి జనసేన ఇన్చార్జి పంచకర్ల సందీప్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన పార్టీలో ఆమె భర్త పోతిన తిరుమల రావు మంచి సేవలు అందించారు. అందుకు ప్రతిఫలంగా ఆమెకు ఈ డైరెక్టర్ పదవి వరించింది. ప్రజారాజ్యం తొలినాల నుంచి చిరంజీవి కుటుంబ పట్ల తిరుమల రావుకు ఎనలేని అభిమానం. ఆ అభిమానమే ఆయనను నాయకుడిని చేసింది. జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భీమిలి ఇన్చార్జ్ సందీప్ తమపై ఎంతో నమ్మకంతో ఈ పదవి కట్టబెట్టారని దానిని సద్వినియోగం చేసి అటు ప్రజా సంక్షేమానికి, ఇటు పార్టీ అభివృద్ధికి.తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇటీవల
ఎండాడ జనసేన పార్టీ కార్యాలయంలో సందీప్ చేతుల మీదుగా ఆర్డర్స్ కాపీ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పిఎసిఎస్ డైరెక్టర్గా నియామక పత్రాన్ని వార్డు అధ్యక్షులు నాగోతి నరసింహనాయుడు కృష్ణయ్య, శ్రీని బాబు శ్రీను, సతీష్,శివ, నాని, పి. శ్రీను శంకర్, కామేషు గంగరాజు నేత పార్టీ నాయకులు అందరూ కలసి వారి చేతుల మీదగా అందజేయడం పట్ల జనసేన నాయకులకి, కార్యకర్తలకి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తిరుమల రావు తెలిపారు.
-
Newer

Older