చంద్రంపాలెం జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో దుర్గా థియేటర్ ఎదురుగా ప్రధాన కాలువ పూడికతీత పనులు పరిశీలించిన మాజీమంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు , ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, కాలువపూడిక తీత పనులు త్వరితగతిని పూర్తి చేయాలని జోన్2 కమీషనర్ కనకమహాలక్ష్మికి ఆదేశం. కాలు పూడికతీత పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఎమ్మెల్యే గంటా.

డ్రెయిన్లలో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. మధురవాడ జోన్ టు కమిషనర్ కనక మహాలక్ష్మికి ఆదేశం. ---- మాజీమంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. భీమిలి నియోజకవర్గం,మధురవాడ, ఆగస్ట్ 3: ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన డ్రెయిన్ల లో మురుగు శుభ్రం చేసే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఆదివారం కాలువల్లో పూడికతీత పనుల ప్రగతిని పరిశీలించారు. డ్రెయిన్లు పూర్తిగా వ్యర్థ పదార్ధాలతో నిండిపోవడం వల్ల పరిసర ప్రాంతాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. స్థానిక కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, ఆమె భర్త వెంకట్రావు డ్రెయిన్లు పూర్తిగా మురుగుతో నిండిపోయాయని కర్రతో శుభ్రం చేసే ప్రయత్నం చేశారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రధాన డ్రెయిన్లలో అనేక ఏళ్లుగా పూడిక తీయకపోవడంతో మురుగు మేటలుగా పేరుకుపోయింది. వర్షం వచ్చినప్పుడు డ్రెయిన్ లో మురుగుతో కలిసి రహదారిపై పొంగి పొర్లుతోంది. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో పూడికతీత పనులకు రూ.75 లక్షలు మంజూరు చేయించారు. అయితే నిత్యం విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండడంతో మురుగు తీసే పనులు వేగంగా జరగడం లేదు. జేసీబీ.. పొక్లేయిన్.. లతో మురుగు తీయాలన్నా ట్రాఫిక్ జామ్ అయిపోతుందని మాన్యువల్ గా శుభ్రం చేస్తున్నారు. దీంతో గంటా శ్రీనివాసరావు 7 వ వార్డు పరిధిలో జరుగుతున్న డ్రెయిన్ లను చూశారు. జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మితో ఫోన్ లో మాట్లాడారు. పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని.. కాంట్రాక్టర్ ను, అధికారులను సోమవారం సమావేశపరచాలని చెప్పారు. నిర్దేశిత గడువులోగా మురుగు తొలగించాలని ఆదేశించారు.