శ్రావణమాసం సందర్భంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు రామకృష్ణ పర్యవేక్షణలో, మధురవాడ సర్వేనెంబర్ 27 కొమ్మాది జంక్షన్ వైఎస్ఆర్ నగర్ లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోపసుపు,కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పణ,,..
August 10, 2025
జై వాసవి. జై జై వాసవి...
విశాఖ సిటీ, మధురవాడ జోన్ 2--- ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం శ్రావణమాసం సందర్భంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ వారి ఆధ్వర్యంలో మధురవాడ సర్వేనెంబర్ 27, వికలాంగుల కాలనీ వైయస్సార్ రాజీవ్ గృహకల్ప వద్ద, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయము నందు అమ్మవారికి పట్టు చీర, జాకెట్, పసుపు కుంకుమ, పండ్లు,కాయలు స్వీటు అమ్మవారికి సారెగా సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్స్ వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, ప్రోగ్రాం చైర్ పర్సన్ పాలూరి శివరామకృష్ణ పాల్గొన్నారు.