చేనేత రంగ కార్మికులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే ---- భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. .
August 11, 2025
చేనేతలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం భీమిలి నియోజకవర్గం చేనేతలందరూ కలిపి తగరపవలసలో అభినందనలు తెలియజేసే కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు భీమిలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు విచ్చేసి సభను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు చేనేత కార్మికుల కాదు చేనేత కళాకారులు మీరు అంటూ చేనేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ మొదటి విడుదలోని డైరెక్టర్ పదవి నాకు వచ్చే విధంగా కృషి చేసిన మా ప్రియతమ నాయకులు శ్రీ గంటా శ్రీనివాస గారికి కృతజ్ఞతలు తెలియజేశారు వివిధ సంఘాల నుంచి వచ్చిన పెద్దలందరూ జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు అంటూ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు