జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటా, భీమిలిలో జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ భీమిలిఎమ్మెల్యే గంటా తనయుడు గంటా రవితేజ

పత్రికా సోదరుల సంక్షేమానికి కృషి* — *గంటా రవితేజ* *భీమిలి జర్నలిస్టులకు హెల్మెట్‌ల పంపిణీ* విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) భీమిలి,ఆనందపురం, పద్మనాభం,తగరపువలస ప్రాంతాల్లో నూతనంగా ఏర్పడిన వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమార్థం హెల్మెట్‌ల పంపిణీ కార్యక్రమం ఆదివారం భీమిలి టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటా.రవితేజ జర్నలిస్టులకు హెల్మెట్లు అందజేశారు.కార్యక్రమం గంటా యువసేన ఆధ్వర్యంలో, పెద్దిపాలెం గ్రామానికి చెందిన మరుపిల్ల బంగారునాయుడు అలియాస్ బాబ్జి తనయుడు సాయి జ్ఞానేశ్వర్ ప్రోత్సాహంతో నిర్వహించబడింది.ఈ సందర్భంగా కమిటీ మూడు ప్రధాన ఎజెండాలను ప్రకటించింది.తగరపువలసలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం, జర్నలిస్టులకు ప్రమాద బీమా మరియు ఆరోగ్య భద్రత, అర్హులైన జర్నలిస్టులకు పక్కా ఇళ్ల స్థలాల మంజూరుకు ప్రధాన లక్ష్యాలుగా కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది. సందర్భంగా గంటా.రవితేజ మాట్లాడుతూ...కార్యవర్గం నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు.ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు వాహన ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ హెల్మెట్లను bఅందజేశారు.2014-19లో కొంతమంది జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇచ్చినట్లు,మిగిలిన వారికి కూడా ఇవ్వడానికి కృషి చేస్తామని తెలిపారు. నియోజకవర్గస్థాయిలో భీమిలి,ఆనందపురం,పద్మనాభం, తగరపువలస ఏరియా జర్నలిస్టుల అందర్నీ ఒకే వేదిక పైకి రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.రెండవ వార్డు కార్పొరేటర్ గాడు.చిన్ని కుమారి మాట్లాడుతూ...అన్ని ప్రాంతాల జర్నలిస్టులు కలవడం శుభపరిణామామని తెలిపారు. ప్రజల సమస్యలను పాలకులకు చేరవేసే వారధిగా జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు. బోని ఈశ్వర్ కుమార్, దొంతల శ్రీను, కోరాడ.సూరిబాబు, ఉపాధ్యక్షులు రౌతు.నాగరాజు బుసర.శ్రీను,కోశాధికారి కోలా. శివప్రసాదు తదితర కార్యవర్గాన్ని యువ నాయకులు గంటా రవితేజ అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంటా.నూకరాజు,టీడీపీ మాజీ ఇంచార్జ్ విజయబాబు,టిడిపి సీనియర్ నాయకులు స్వామి మూడవ వార్డు టిడిపి అధ్యక్షులు గొలగాని నరేంద్ర, బి...జాగ్ రెస్టారెంట్ అధినేత అమటాపు. శ్రీకాంత్, మరిపిల్లి.సాయి జ్ఞానేశ్వర్ రావు,కాకర.సురేష్, దేవుడు బాబు,నూతన కార్యవర్గ సభ్యులు,మండల నాయకులు పాల్గొన్నారు.