చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో ఘనంగా వర లక్ష్మీ వ్రతం పూజలు, 300 మందికి అన్నదానం, మహిళల కుంకమ్మ పూజలు.
August 08, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ మాసం మూడవ శుక్రవారము వరలక్ష్మి వ్రతం పూజలు, ప్రత్యేక కుంకుమ పూజలు!
ఆలయ ప్రాంగణంలో (300) మూడు వందల మందికి అన్న ప్రసాదం (అన్నసంతర్పణ) వితరణ!
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్,: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం మూడవ శుక్రవారం శుద్ధ చతుర్దశి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం అమ్మవారికి నిత్య అర్చనలతో ప్రారంభమై కుంకుమార్చన, పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరి ప్రసాద్ శర్మ, రాంబాబు శర్మ, మూర్తి శర్మలు తదితరులు నిర్వహించి కర్పూర హారతి నీరాజన మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు,
శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో భక్తులు స్వహస్తాలతో చేసుకొనే విధంగా ప్రత్యేక కుంకుమ పూజలు ఆలయ అర్చకులు జరిపించారు,
సాయంత్రం వేళలో అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి ప్రత్యక పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు,
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో దీపారాధన సేవా కార్యక్రమాలు నిర్వహించారు,
ఈ సందర్భంగా మధురవాడ చంద్రంపాలెం వాస్తవ్యులు పి.వి.జి.అప్పారావు, యశోద దంపతులు ఉదయం ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాదం, మరియు చంద్రంపాలెం వాస్తవ్యులు పిళ్లా సూరిబాబు, వరలక్ష్మి, పిళ్లా వెంకటరమణ, వరలక్ష్మి దంపతులు సాయంత్రం ఏర్పాటు చేసిన రవ్వ కేసరి ప్రసాదం,
అమ్మవారికి నైవేద్యంగా నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు,
ప్రతీ శుక్రవారం కనీసం వంద మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సంకల్పంలో భాగంగా ఈరోజు శుక్రవారం మధురవాడ చంద్రంపాలెం దుర్గానగర్ వాస్తవ్యులు రుద్రరాజు వెంకట సత్య సారధి రాజు, అరుణ దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో ఆలయంలో (300) మూడు వందల మంది భక్తులకు, పేదలకు అన్న ప్రసాద (అన్నసంతర్పణ) నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరి నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, కమిటీ సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, గూడేల రాజు, పిళ్లా రమణ, కేశనకుర్తి అప్పారావు, పిళ్లా రాజు, మరుపిల్లి ఆనంద్
చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, పీస రామారావు
ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, వాండ్రాసి అప్పారావు, పిళ్లా అప్పారావు , పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న, పిళ్లా సూరి పాత్రుడు, సుందర శ్రీను, పొట్నూరి వాసు, యస్.శ్రీను, ఆలయ సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.