వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం వితరణ.

విశాఖ సిటీ,(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) తేదీ 05.08.2025 మంగళవారం, ఉదయం పెద్ద వాల్తేరదలై వారి వీధిలో రెడ్ క్రాస్ సొసైటీ లో ఉన్న నిరాశ్రుయులైన వయోవృద్ధులకు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో జల్లూరి సోమేశ్వర గుప్తా, లక్ష్మీ సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కాపుగంటి వెంకటరమణమూర్తి , కోశాధికారి చంద్రశేఖర్ గుప్త, ఐపిపి గుప్తా, హర గోపాల్,, జ్ఞాన శివసాయి పాల్గొన్నారు.