5వ వార్డ్ లో సమస్యలు పరిష్కారం చేయండి. జీవీఎంసీ మేయర్ కు వినతిపత్రం అందజేసిన ఐదవ వార్డ్ కార్పొరేటర్ హేమలత.

వార్డు సమస్యలపై మేయర్ కు వినతి. వార్డులో పూర్తిగా పాడైపోయి ఉన్న రోడ్లు,కాలువలు ను సత్వరమే పునః నిర్మించాలి. 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత_. భీమిలి నియోజకవర్గం, మధురవాడ:( ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ.) వార్డులో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఐదవ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ మొల్లి హేమలత వినతిపత్రం అందించారు. ముఖ్యంగా వార్డులో దశాబ్దాల క్రితం వేసి పూర్తిగా మరమ్మత్తులకు గురై ఉన్న రోడ్లు,కాలవలను వెంటనే పున:నిర్మించాలని, శివశక్తి నగర్ నుండి మారికవలస ఐటీ సెజ్ రోడ్డును కలుపుతూ కల్వర్టు మరియు రోడ్డును వెంటనే వేయాలని, బోరవానిపాలెం ప్రధాన రహదారి,కాలువలను పునర్మించాలని, బొట్టవానిపాలెం చెరువును ఆధునికరించాలని, మారికవలస పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలని అలాగే మారికవలస నుండి ఐటీ సెజ్ కు వెళ్ళే 100 అడుగుల రోడ్లో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని, వార్డులో వీధి లైట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రధాన కూడళ్లలో రింగ్ పోల్ లైట్ లు ఏర్పాటు చేయవలసిందిగా, తదితర వార్డు సమస్యలును తెలియజేస్తూ సత్వరమే పరిష్కరించాలని కార్పొరేటర్ హేమలత మేయర్ ను కోరారు. సానుకూలంగా స్పందించి దసలవారీగా వార్డు సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని మేయర్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారని కార్పొరేటర్ హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు.