అభివృద్ధి బాటలో భీమిలి నియోజకవర్గం. అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీట. భీమిలి ప్రజల రుణం తీర్చుకుంటా --- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.

బీచ్ కోత నివారణకు రూ. 210 కోట్లు. రూ. 595 కోట్లతో తాగునీరు, రూ. 292 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టులు. రెండు జోన్లుగా భీమిలి నియోజకవర్గం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నియోజకవర్గo ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) భీమిలి బీచ్ కోత నివారణకు రూ. 210 కోట్లతో రిటైనింగ్ వాల్ సహా ఇతర రక్షణ చర్యలు చేపట్టనున్నట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.. నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి భీమిలి తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులకు రక్షణ చర్యలతో చెక్ పడుతుందన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతంలో నీటి ఎద్దడి నివారణకు రూ.595 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు.. మురుగు నీటి సమస్యను అధిగమించడానికి రూ. 292 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భీమిలి నియోజకవర్గం పరిధిలోని 9 జీవీఎంసీ వార్డుల్లో రూ.100 కోట్లతో మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నామని వెల్లడించారు. 2014 - 19 లో మంత్రిగా భీమిలిని రూ. 4,700 కోట్లతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఆ స్థాయి అభివృద్ధి కావాలని 2024 లో రీ సౌండ్ వచ్చేలా 93 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారన్నారు. భీమిలి అభివృద్ధి కాంక్షిస్తూ రాజకీయాలకు అతీతంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులతో భీమిలి డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేస్తానని, ప్రతి 3 నెలలకోసారి సమావేశమై భీమిలి అభివృద్ధికి ఫోరం నిర్ణయాలను తీసుకుంటుందని పేర్కొన్నారు.. అలాగే ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి కోసం భీమిలి విజన్ డాక్యుమెంట్ తయారు చేయిస్తున్నానన్నారు. 2026 జూన్ నాటికి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సిద్ధమవుతుందని, ఆ సమయానికి పెరిగే ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవడానికి ప్రస్తుతమున్న భీమిలి - తగరపువలస రోడ్డును 150 అడుగులకు విస్తరించాలని ప్రతిపాదించి ఆర్డీపీ కూడా సిద్ధం చేశారని, స్థానికుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన సవరించిన తుది ఆర్డీపీ ప్రకారమే విస్తరణ పనులను చేపడతామన్నారు. ఈ రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయే వారికి టీడీఆర్ తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులు కేటాయించే అవకాశాన్ని పరిశీలించాలని మేయర్ కు సూచించారు. తాజా ప్రతిపాదన ప్రకారం నియోజకవర్గం ఒక జీవీఎంసీ జోన్ గా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని, 3.75 లక్షలు పైగా జనాభా గల భీమిలిని పాలనా సౌలభ్యం కోసం రెండు జోన్లుగా విభజించాలని కోరగా.. అనుకూల స్పందన వచ్చిందని పేర్కొన్నారు. భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే అంశాన్ని కూడా కౌన్సిల్ లో తీర్మానం చేసి పంపాలన్నారు. చెక్ డ్యాం నిర్మాణం ద్వారా గోస్తనీలో వాటర్ రీ ఛార్జ్ అవుతుందని, ఆ పనులను చేపట్టే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్, సత్వా, సిఫీ, అదానీ డేటా సెంటర్ వంటి ఐటీ సంస్థలు విశాఖలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే, లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. భీమిలి - విజయనగరం మధ్య బస్సులను ప్రవేశపెట్టేలా ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు.