ఎంవిపి కాలనీలో గురుకుల పాఠశాల లోని 90 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన వాసవి క్లబ్ ఎం.వి. పి కపుల్స్ ఆధ్వర్యంలో మేడం శకుంతల పర్యవేక్షణలో పంపిణీ .
August 19, 2025
జై వాసవి. జై జై వాసవి..
విశాఖ సిటీ, ప్రజా బలం న్యూస్ ఆన్లైన్:
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో తేదీ 19.08.2025 మంగళవారం నాడు సెక్టార్ 9 ఎంవిపి కాలనీ లోగల ఎస్ ఎస్ వి గురుకుల పాఠశాలలో గల సుమారు 90 మంది విద్యార్థిని, విద్యార్థులకు నోట్ పుస్తకములు శ్రీమతి శకుంతల మేడం పర్యవేక్షణలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్బు ఉపాధ్యక్షులు వాసవియన్ కాపుగంటి శ్రీనివాసరావు, ప్రోగ్రామ్ చైర్మన్ వాసవియన్ పాలూరి శివరామకృష్ణ, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.