పాడేరు సత్య సాయి మందిరంలో 50 మంది గిరిజనులకు అమృత కలసాలు పంపిణీ చేసిన విశాఖ జిల్లా ఎం వి వి సిటీ సత్య సాయి భక్తులు. సత్య సాయి సెంటర్ బాధ్యులు రామకృష్ణ శివాజీ, పీఎం పాలెం సమితి కన్వీనర్ ప్రభాకర్.,
August 24, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో విశాఖ సిటీ, 8వ వార్డులో ఎం వివి సిటీ శ్రీ సత్య సాయి సెంటర్ నిర్వాహకులు, పీఎం పాలెం కన్వీనర్ ప్రభాకర్, శివాజీ వెంకట రామకృష్ణారావు, సాయి సెంటర్ భక్తుల ఆధ్వర్యంలో ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సత్యసాయి మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి భజనలు చేశారు. నామ సంకీర్తన అనంతరం స్వామివారికి మంగళహారతి ఇచ్చారు. అనంతరం 50 మంది గిరిజనులకు (అమృత కలశాలు) నెలరోజులకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేశారు. మహిళలకు చీరలు వస్త్రాలు, విభూది, స్వామి వారి ఫోటోలు అందజేశారు.. ఈ సందర్భంగా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆలయ అర్చకులు సాయి భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించి గర్భగుడిలో దర్శనం చేయించారు. అనంతరం సత్య సాయి సేవా సంస్థల అల్లూరి సీతారామ రాజు జిల్లా అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వామి ఇక్కడ వెలసారని ఎంతోమంది గిరిజనుల జీవితాలలో మార్పులు తీసుకువచ్చిన కి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆయన సేవ చేస్తే సేవ్ చేస్తారని పేర్కొన్నారు. ప్రతి నెల 24వ తేదీన ఏ శుభకార్యము తలపెట్టిన అది దిగ్విజయంగా జరుగుతుందని ఎన్నోసార్లు నిరూపణ అయిందని పేర్కొన్నారు. ఇక్కడ స్వామి మందిరం గిరిజనులే శ్రమ దానం చేసి నిర్మించారని వీరందరికీ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. అమృత కళాశాల అందజేసిన ఎంవివి సిటీ భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి మారుమూల ప్రాంతాలలో కొత్త వారు ఎవరైనా వస్తే గిరిజనులు ఎంతో ఆనంద పడతారని సాయి భక్తులంతా వచ్చి ప్రతి నెల తమ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ సాయి భక్తులను చూసి తమ మందిరం వద్ద ఉన్న గిరిజనులు అంతా ఎంతో ఆనందపడ్డారని పేర్కొన్నారు. గిరిజనులకు స్వామి అందించిన మంచినీరు వారి హృదయాలలో నాటుకు పోయిందని ప్రతి మండలం పంచాయతీ లలో భజన మండలి ఏర్పాటు అయ్యిందని చెప్పారు. గిరిజనులకు ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారు ఆరోగ్యంగా ఉండే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు మంచి. సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.