కడిమిశెట్టి సత్యవతి ప్రథమ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్ ఆధ్వర్యంలో నిరాశ్రయులైన వయోవృద్ధులకు ఆర్థిక సహాయంతో పాటు, అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం వితరణ.
August 23, 2025
జై వాసవి. జై జై వాసవి. వాసవి క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో శనివారం .... తేది... 23-08-2025 న, కీర్తిశేషులు కడిమి శెట్టి సత్యవతి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో ఎన్ ఏ డి కొత్త రోడ్ దగ్గర గల పట్టణ నిరాశ్రయులైన వసతి గృహం నందు ఉదయం7 గంటల30 నిమిషములకు 40 మంది వయోవృద్ధులకు అల్పాహారం మరియు మధ్యాహ్నం 12 గంటల30 నిమిషములకు జీ వి ఎం సి పరిధిలోగల భీమ్ నగర్ ఏ.యూ.టి.డి. షెల్టర్ లో వున్న 80 మంది నిరాశ్రుయులైన వయోవృద్ధులకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, పూర్వపు కోశాధికారి హరగోపాలరావు మొదలైన వారు పాల్గొన్నారు.