మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్న జీవీఎంసీ 7 వవార్డు కార్పొరేటర్ మంగమ్మ. ముందుగా నీ పాదములను గొలిచెద మూషిక వాహన దోష నివారణ..ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు కార్పొరేటర్ మంగమ్మ వెంకట్రావు దంపతులు తెలిపారు.
August 25, 2025
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:
(సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
భీమిలి నియోజక వర్గంలో 7వ వార్డు లో వినాయక చవితి సందర్భంగా ఆయుష్ హాస్పిటల్ సహకారం తో 7వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ , టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ అమన్ చేతుల మీదుగా ప్రకృతి కి హాని లేని మట్టి వినాయక విగ్రహాలను వినాయక భక్తులకు అందజేశారు.
ఈ కార్యక్రమం లో 7వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు, మల్లువలస రాము కృష్ణ కిషోర్ సింహాచలం వెంకటలక్ష్మి కాంతం సత్యవతి రోజా డోలా లక్ష్మీ టీడీపీ నాయకులు ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యం నగర ప్రజలు పాల్గొన్నారు.