ఆలయ నిర్మాణ కాంక్రీట్, స్లాబ్ పనులకు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ సభ్యులు, వాసవి యన్స్ చార్టర్ ప్రెసిడెంట్ చెరకు కృష్ణ, వాసవిఎంవిపి కపుల్ అధ్యక్షులు వెంకట రామకృష్ణ రావు, 70 వేల రూపాయలు ఆర్థిక సహాయం.
August 30, 2025
విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి.. జై జైవాసవి శ్రీ శ్రీశ్రీ
సీతారామ సాగర లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో ఆలయ కమిటీ వారు నిర్మించ తలపెట్టిన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు అభ్యర్థన మేరకు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ సభ్యులు వాసవియన్స్ చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణ రావు, క్లబ్బు ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి,, రీజినల్ సెక్రటరీ పుష్పలత తదితరులు 70 వేల రూపాయలు విరాళమును ఆలయ కమిటీ సభ్యులు సమక్షంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కమాండర్ దాసు, ఆలయ కోశాధికారి దాసుగారు లకు అందించడమైనది. ఈ కార్యక్రమానికి హాజరైన వాసవి క్లబ్ సభ్యులు పి శివరామకృష్ణ, కే శ్రీనివాసరావు, పి చంద్రశేఖర్ గుప్తా, మల్లేశ్వర గుప్తా, నర్సింగరావు, బి . హరగోపాల్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు నరసింగరావు, సహకార్యదర్శి రాజు, పాల్గొన్నారు.