బొబ్బిలిలో చిన్న శ్రీను పుట్టినరోజు వేడుకలు, తండ్రి జన్మదిన వేడుకలను ముందుగానే వారి అభిమానుల చేత అంగరంగ వైభవంగా జరిపించుతున్న చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ.

ఈ నెల 5 వ తేదీన జరగనున్న జెడ్పీ చైర్ పర్సన్ జన్మ దిన వేడుకలు ముందుగానే చిన్న శ్రీను అభిమానులు అంగ రంగ వైభవంగా జరుపుకున్న పుట్టిన రోజు వేడుకల ఆహ్వానంలో పాల్గొన్న సిరమ్మ. చిన్న శ్రీను స్పూర్తితో ముందుకు సాగాలి. తే03.09.2025దీ, బొబ్బిలి, 03సెప్టెంబర్ నెల 2025, బుధవారం, బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలిలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను)* పుట్టిన రోజు ఈ నెల 05 తేదీన జరగనున్న వేడుకలు ముందుగానే చిన్న శ్రీను అభిమానులు చేసిన పలు కార్యక్రమాలలో వారి కుమార్తె *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పాల్గొన్నారు. బొబ్బిలి ఆర్.సి.ఎం.స్కూలు bలోని స్పెషల్ లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి(డెఫ్ & డంబ్) కి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తరువాత బొబ్బిలిలోనీ గవర్నమెంట్ హాస్పిటల్ లోనీ గర్భిణీ స్త్రీలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలో రక్తదాన శిబిరం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతావాది విజయనగరం జెడ్పీ చైర్ పర్సన్ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమన్నారు. ముఖ్యంగా రక్తదానం చేయడం వలన కొందరి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుందని అందువలన యువత ఈ విషయమై ముందుకు రావడం ప్రశంస నీయమన్నారు. చిన్న శ్రీనువంటి నాయకుడిని స్పూర్తితో తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, వై.యస్. ఆర్.సీ.పీ.నాయకులు, చిన్న శ్రీను గారి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
k