ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ సమీపంలో ఏ యు టి డి షెల్టర్ లో ఉన్న నిరాశ్రయులైన వయోవృద్ధులకు అన్నదానం,, యూఎస్ఏ లో ఉన్న డాక్టర్ గట్టా కామేశ్వరి ఆర్థిక సహకారంతో అన్నదానం. ఎంవిపి వాసవి క్లబ్ కపుల్ అధ్యక్షుడు . రామకృష్ణ విస్తృతం చేస్తున్న వాసవి సేవలు.
August 12, 2025
జై వాసవి. జై జై వాసవి.
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఎం.వి.పి.కపుల్స్ ఆధ్వర్యంలో మంగళవారం... తేది... 12-08-2025 న మధ్యాహ్నం
గౌరవనీయులు శ్రీ రఘు గట్టా గారి జన్మదినం సందర్భంగా టి.ఎస్.అర్. కాంప్లెక్స్ (వైభవ్ జువెల్లెర్స్ ఎదురుగా)ఏ.యూ.టి.డి. షెల్టర్ లో వున్న నిరాశ్రుయులైన వయోవృద్ధులకు డాక్టర్ కామేశ్వరి గట్టా
(యు.ఎస్. ఏ)వారి ఆర్థిక సహకారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వాసవియన్స్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, క్లబ్ సభ్యులు కృష్ణకుమారి, మరియు అప్పలరాజు పాల్గొన్నారు.