ఆంధ్ర యూనివర్సిటీలో దివ్యాంగుల సదస్స. విశాఖ జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 600 మంది దివ్యాంగులు వారి తల్లిదండ్రులకు అన్నదానం.
September 22, 2025
విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
జై వాసవి.
జై జై వాసవి....
తేదీ 22.09.2025 సోమవారం ఉదయం 11.00 గంటలకు
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్, ఇండియన్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ విత్ డిసెబిలిటీస్ ,(దివ్యాంగులు )వారు ఆంధ్రా యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజ్ లో గల అంబేద్కర్ హల్ నందు సంయుక్తంగా నిర్వహించిన *పర్పుల్ ఫెయిర్* సదస్సు లో అంతర్జాతీయ వాసవి క్లబ్ సూచనల మేరకు *వి 201ఏ*
విశాఖపట్నం జిల్లా వాసవి క్లబ్ వారు ఆ సదస్సు లో పాల్గొని, ఆ సంస్థ దివ్యాంగులకు చేస్తున్న ఆవాహన కార్యక్రమాలు , అవగాహన కోసం ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ తిలకించి ఆ సదస్సులో పాల్గొన్న దివ్యాంగులకు,వారి తల్లి దండ్రులకు,సదస్సులో పాల్గొన్న వారికి సుమారు 600 మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినారు. ఈ భోజనాలు ఏర్పాటు చేసినందుకు గాను, సదస్సు నిర్వహించిన నిర్వాహకులు అంతర్జాతీయ వాసవి క్లబ్స్ (విశాఖపట్నం జిల్లా వాసవి క్లబ్ సభ్యులు కు) ధన్యవాదములు తెలిపిరి.ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్,కోశాధికారి చెరుకు క్రిష్ణ, ప్రాంతీయ అధికారిణి శైలజ,వాసవి క్లబ్ సభ్యులు వెంకట రామకృష్ణారావు, వెంకటరమణమూర్తి, మల్లేశ్వర గుప్తా,కృష్ణారావు,నర్సింగరావు,శ్రీనివాసరావు,కళ్యాణరాజ్,విజయకుమార్, శివశంకర్ మున్నగు వారు పాల్గొన్నారు.