శిల్పారాం జాతర గట్టుపై వెలసిన చంద్రమ్మ పాలెందుర్గమ్మ ఆలయంలో నేటి నుండి ఘనంగా ప్రారంభం కానున్న దసరా నవరాత్రి మహోత్సవాలు. అంగరంగ వైభవంగా ఏర్పాటుచేసిన ఆలయ కమిటీ.

జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో నేటి నుండి దసరా ఉత్సవాలు! మధురవాడ వైజాగ్ ఎక్స్ప్రెస్ : విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీషిర్డీ సాయినాధ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ సమావేశం ఆదివారం ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు అధ్యక్షతన జరిగింది, సోమవారం నుండి జరగనున్న దసరా నవరాత్రి మహోత్సవములు శనివారం వరకు అత్యంత వైభవంగా జరుప బడుని తెలిపారు, అనంతరం ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు, దసరా నవరాత్రి ఉత్సవాలు తేదీ 22/9/2025 సోమవారం ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ముందుగా పల్లకిలో ఊరేగించి అనంతరం కళశ స్థాపన జరుగునని , సోమవారం నుండి పది రోజులు ప్రతీ రోజు ఉదయం అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం అలంకరణలు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటలకు నుండి మధ్యాహ్నం 12:00 వరకు సాయంత్రం 5:30 గంటల నుండి 7:30 గంటలకు కుంకుమ పూజలు తదితర పూజా కార్యక్రమాలు జరుగునని, మరో ప్రక్క సూర్య నమస్కారాలు, హోమం కార్యములుతేదీ 29/9/2025 సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అన్నసంతర్పణ జరుగును, దసరా ఉత్సవాలు ముగింపు సందర్భంగా తేది 03/10/2025 శుక్రవారం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి కళశ జలాలతో సహస్ర ధార శాంతి అభిషేకం అదే రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో అన్నసంతర్పణ జరుగును, దసరా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొను వేలాది మంది భక్తులకు ఎటువంటిఅసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్ర శేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, చంద్రంపాలెం పెద్దలు బావిశెట్టి సత్యన్నారాయణ, పీస రామారావు, పిళ్లా సత్యన్నారాయణ, జగుపిల్లి నాని, ఆలయ కమిటీ సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, కార్యవర్గ సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, కేశనకుర్తి అప్పారావు, పిళ్లా రమణ, బోగవిల్లి రాము, బంక వాసు, మరుపిల్లి ఆనంద్, పిళ్లా రాజు, దుర్గాశి శోభన్ బాబు, ముఖ్య సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిళ్లా పోతరాజు, జగుపిల్లి అప్పారావు, పి.వి.ఆర్.మూర్తి, పిళ్లా అప్పన్న, బొల్లు అప్పారావు, పిళ్లా గోకుల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.