అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన చంద్రంపాలెం దుర్గాలమ్మ. ఘనంగా దసరా శరన్నవరాత్రి పూజలు. కుంకుమ పూజలకు పోటెత్తిన భక్తులు .
September 24, 2025
శ్రీ అన్నపూర్ణ దేవిగా చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ అమ్మవారు
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ )
విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవములు మూడవ రోజు ఘనంగా జరిగాయి, ముందుగా అమ్మవారి విరాట్ కు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకములు జరిపించి అనంతరం ఈరోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలు నీరాజన మంత్రపుష్పం ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది, మరియు సూర్య నమస్కారాలు, ప్రత్యాకంగా గాజుల పూజా జరిపించారు హోమం నీరాజన మంత్రపుష్పం మొదలగు కార్యక్రమాలు ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మలు బృందం నిర్వహించడం జరిగింది, సాయంత్రం వేళల్లో కుంకుమార్చనలు నీరాజనం మంత్రపుష్పం పురాణ ఇతిహాసముల నుండి స్వస్తులు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు,
పి.యం.పాలెం లక్ష్మివానిపాలెం వాస్తవ్యులు పోతిన అప్పారావు, వరలక్ష్మి కుమారులు పోతిన ఎల్లాజీ బ్రదర్స్ సహాయ సహకారాలతో పులిహోర, పూర్ణాలు (బూరెలు) ప్రసాదం అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణి చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, జాయింట్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, బోగవిల్లి రాము , గూడేల రాజు, దుర్గాశి సోంబాబు, కేశనకుర్తి అప్పారావు, పొట్నూరి హరికృష్ణ, పిళ్లా రాజు,
చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా సత్యన్నారాయణ, బి.సత్యన్నారాయణ, పీస రామారావు, జగుపిల్లి నాని,
ఆలయ ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పి.వి.రమణమూర్తి, జగుపిల్లి అప్పారావు, పోతిన. వెంకటరమణ, పిళ్లా రాము, పిళ్లా అప్పన్న, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పారావు, గూడేల కామేశ్వరరావు, పిళ్లా సూరి పాత్రుడు, పిళ్లా రాజు, రాజగిరి శ్రీను, సుందర శ్రీను, పి.శ్రీను, గరె రామారావు, యస్.శ్రీను, గరె మధు, డి.అప్పారావు, పి.నాగ తదితరులు పాల్గొన్నారు.