ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, గీతం కాలేజీ ప్రొఫెసర్లు l.నాగేశ్వరరావు ఉమాదేవి దంపతులకు ఘన సన్మానం.

జై వాసవి.. జై జై వాసవి... 05.09.2025 శుక్రవారం. విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) మధురవాడ. ఉపాధ్యాయుల దినోత్సవం. సందర్భంగా శుక్రవారం వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులైన గీతం కాలేజ్ ప్రొఫెసర్లు నాగేశ్వరరావు, ఉమాదేవి దంపతులకు లాసన్స్ బే కాలనీలో గల వారి నివాసము నందు సాలువతో సత్కరించి ,పండ్లు,బహుమతి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు , ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికార చంద్రశేఖర్ గుప్త, ప్రోగ్రాం చైర్మన్ శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, గ్రంధి కృష్ణారావు, క్లబ్ సభ్యులు చెరుకూరి నర్సింగరావు పాల్గొన్నారు.