ఆత్మరక్షణ ఆయుధం తైక్వాండో --- విశాఖ నగర పోలీస్ కమిషనర్. శిల్పారామం జాతరలో విజయవంతంగా ముగిసిన రాష్ట్రస్థాయి ఆనంద్ క్వాండో క్రీడలు
September 14, 2025
ఆత్మరక్షణ ఆయుధం టైక్వాండో
నగర పోలీస్ కమిషనర్
శంఖా బ్రతా బాగ్చి
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ (జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
విజయవంతంగా ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు
గ్రేటర్ విశాఖ మధురవాడ శిల్పారామం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆమెచ్చూర్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ ఆనంద్ తైక్వాండో అండ్ మార్షల్ ఆర్ట్స్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి.
గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి
విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం, తోపాటు ఉభయగోదావరి జిల్లాలైన ఈస్ట్ వెస్ట్ , రాయలసీమ నుండి కడప కర్నూల్, అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల నుండి
సుమారు 200 మంది తైక్వాండో క్రీడాకారులు ఈ పోటీలలో తలపడ్డారు.
బాల బాలికలకు వేరువేరుగా శరీర బరువు ఆధారంగా సబ్ జూనియర్ క్యాడెట్, జూనియర్ ,సీనియర్ విభాగాలలో ఈ పోటీలు జరిగాయి.
ముగింపు వేడుకలకునగర పోలీస్ కమిషనర్ శంఖా బ్రతా బాగ్చి గారు ముఖ్యఅతిథిగా విజేతలకు మెడల్స్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
యుద్ధ విద్యలు నేర్చుకోవడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయని
ఈ సందర్భంగా ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలు కు మరింత అవసరమని అందులో టైక్వాండో లోని ఆత్మరక్షణ పద్ధతులు మరింత చురుకుతనాన్ని ఇస్తాయని వివరిస్తూ మార్షల్ ఆర్ట్స్ పై తన మక్కువ తెలియజేశారు.
ఇటువంటి పోటీలు నిర్వహణలోనూ ప్రతిభను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని సిపి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహక కార్యదర్శి ఆనంద్, టైక్వాండో రాష్ట్ర సంఘం కార్యదర్శి గ్రాండ్ మాస్టర్ బాబురావు, ఎన్ ఐ ఎఫ్ ఎస్ సీఈవో సునీల్ మహంతి, రిత్విక్ హాస్పిటల్ డాక్టర్ కార్తీక్ పైడి, వాకర్స్ 20 20 పీఎం పాలెం అధ్యక్షులు శేఖర్, బాబ్జి, స్థానిక నాయకులు మారుతి ప్రసాద్, బంగారు ప్రకాష్, పిఎసిఎస్ డైరెక్టర్ మీనాక్షి తిరుమల్ రావు తదితరులతోపాటు
కర్నూలు జిల్లా కార్యదర్శి వెంకటేష్, కాకినాడ సతీష్, తిరుపతి బాలకృష్ణ, చిత్తూరు చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
