విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ కు సొంతగనులు కేటాయించి విస్తరణ చేయవలసిన ప్రభుత్వాలు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నాయి.. అబద్ధం ఆడితే అతుక్కున్నట్లు ఉండాలి -- ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీయకుండా విశాఖ ఉక్కును కాపాడాలి.----- ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో గౌరవించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ తమ అధిష్టానానికి వాస్తవాలు తీసుకెళ్లాలి. విశాఖ ఉక్కును నిలబెట్టాలి. విశాఖ గుండెకాయను నిలబెట్టే బాధ్యత మాధవ్ తీసుకోవాలి.---- విశాఖ సిపిఐ డిమాండ్.

మాధవ్ ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పండి - సిపిఐ విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విశాఖ ఉక్కు కర్మాగారం పై ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా కార్యదర్శి ఎస్ కె రహిమాన్ లు కోరారు. ఆదివారం వారిరువురు పత్రికా ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాకారానికి ఎన్డిఎ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకుంటే వామపక్ష పార్టీలు విశాఖ ఉక్కును కేంద్రం ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నదని అబద్దపు ప్రచారం చేస్తున్నాయని మాధవ్ గారు చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. ఉక్కులో 43 విభాగాలను ఒక్కొక్కటి ప్రైవేట్ పరం చేసి కార్మికులను తొలగించడం అబద్దమా అని వారు ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగం లోనే కొనసాగిస్తాం అని ఈరోజు విశాఖ వచ్చిన మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా తో ప్రకటన చేయించండి అని తెలిపారు. విశాఖ ఉక్కును విస్మరించి ప్రైవేట్ రంగంలో నెలకొలపుతున్న ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ కంపెనీకి కేంద్రం ప్రభుత్వం ఎరకమైన అనుమతులు ఇవ్వలేదని చెప్పించండి. నవరత్న హోదా కలిగిన విశాఖ ఉక్కుకు స్వంత ఘనులు కేటాయించి అన్ని రకాలుగా కేంద్రం ప్రభుత్వం ఆడుకుంటుంది అని చెప్పించాలని ఈ ప్రాంతానికే చెందిన వ్యక్తిగా మాధవ్ బాధ్యత తీసుకోవాలని సిపిఐ తరుపున విజ్ఞప్తి చేశారు.