కృష్ణాపురం గోశాలలో ఘనంగా గోమాత పూజ. గోవిందా గోపాల ఏ నందలాల. రాదే గోపాల గోపి గోపాల, నీ రాకేనాధ ప్రభు మురళీ గోపాల, గోవర్ధనొద్దారా గోపాల బాల.

కృష్ణాపురం గోశాలలో శ్తీకృష్ణ జయంతి వేడుకలు విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మనం శ్రీను )మధురవాడ వరాహలక్ష్మీనృసింహస్వామిదేవస్థానం కృష్ణాపురం గోశాలలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధరావు ఆదేశాల మేరకు, పర్యవేక్షణాధికారి శ్రీ జి.వి.ఎస్.కె. ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకస్వాముల నిర్వహణలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా గోపూజ నిర్వహించారు. ముందుగా అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు, అలంకరణలు, మంగళహారతులు అనంతరం భక్తులు "గోవిందా, గోపాలా" నినాదాలతో గోసాల ప్రాంగణాన్ని మార్మోగింది. ఈ సందర్భంగా గోమాతకు , స్నానం చేయించి, పుష్పమాలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చారు. గోవు చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ శాంతి, సమృద్ధి కలగాలని కోరుకొన్నారు.. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గోమాత పూజలో పాల్గొనడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, ధార్మికంగా గోసేవ ప్రాముఖ్యత అపారమని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.