గీతంలో మెగా రక్తదాన శిబరం. గీతం డ్రీమ్డ్ జాతీయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వెయ్యి మంది సుమారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు స్వచ్ఛందంగారక్తదానం.
September 20, 2025
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మాన0శ్రీను మధురవాడ.)
గీతంలో మెగా రక్షదాన శిభిరం
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పధకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం తేది: 19`09`2025న మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. దాదాపు 1000 మందికి పైగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఎన్‌టిఆర్ బ్లెడ్ బ్యాంక్, ఎ.ఎస్.రాజా వాలంటీరు బ్లడ్ బ్యాంక్, రోటరక్ట్ బ్లడ్ బ్యాంక్, మథర్ బ్లడ్ బ్యాంక్, జిమ్‌సర్ బ్లడ్ బ్యాంక్ ల నుంచి నిపుణులు హజరై విద్యార్ధులనుంచి రక్తాన్ని సేకరించారు. కార్యక్రమాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రో`వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు, గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి డైరక్టర్ ప్రొఫెసర్ కె.నాగేంద్రప్రసాద్, గీతం ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.వి.జి.రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ దేశంలో అత్యవసర పరిస్థితులలో ఉన్నవారికి రక్తం అందించడానికి ఏటా 14.6 మిలియన్ యూనిట్ల రక్తం అవసరమని, సరైన సమయంలో రక్తం లభించక ఏటా 12 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. దేశ అవసరాలకు తగిన విధంగా రక్త సేకరణ స్వఛ్చందంగా రక్తదానానికి ముందుకు వచ్చే ద్వారానే సాధ్యపడుతుందన్నారు. రక్తదానం ద్వారా దాతల ఆరోగ్యం సహితం మెరుగు పడుతుందన్నారు. సామాజిక బాధ్యతగా యువత స్వఛ్చంద రక్తదానానికి ముందుకు రావడం ద్వారా అత్యవసర పరిస్థితులలోఉన్నవారి ప్రాణాలు నిలుస్తాయని యువత స్వచ్చంద రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌లు, ఎన్‌టిఆర్ బ్లెడ్ బ్యాంక్ డాక్టర్‌లు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కె.సోమశేఖర్, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, విద్యార్ధులు పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. గీతంలోని శివాజి ఆడిటోరియం, మధర్‌థెరీసా ఆడిటోరియం, నాలెడ్జిరీసోర్సు సెంటర్ లలో సాయంత్రం వరకు కొనసాగిన రక్తదాన శిభిరంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు రక్తదానం చేయడానికి బారులు తీరారు. విద్యార్ధులు సేవా నిరతిని అధికారులు అభినందించారు.

