విజయనగరం పైడితల్లమ్మ సిరిమానుకు ప్రత్యేక పూజలు చేస్తున్న చిన్న శీను సోల్జర్స్ అధ్యక్షరాలు చిన్న శీను ముద్దుల కుమార్తె సిరమ్మ.
September 24, 2025
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు ఉత్సవాలు లో భాగంగా సిరిమాను చెట్టును దర్శించిన సిరమ్మ.
భీమిలి నియోజకవర్గం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
తే24.09.2025ది.
గంట్యాడ మండలం.
విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం, కొండతామరపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవంలో భాగంగా సిరిమాను చెట్టును దర్శించిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ.పీ.జిల్లా అధ్యక్షులు,భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ బుధవారం పాల్గొని సిరిమానుకు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ పూజారి స్వాగతం పలికి , తదనంతరం వేద పండితులు ఆశీర్వాదం పొందారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ పైడితల్లమ్మ చల్లని కరుణ ఉత్తరాంధ్ర ప్రజల పై ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.