ఎంవిపి కాలనీలో లెహన్ సెల్ఫ్ మానసిక దివ్యాంగుల కేంద్రం లో సులభంగా అర్థమయ్యే రీతిలో వారికి బోధించే ట్రైనింగ్ కిట్లు, మిఠాయి బిస్కెట్లు వితరణ. అకుంఠ దీక్షతో వాసవి వారోత్సవాలు .
September 07, 2025
జై వాసవి.. జై జై వాసవి
తేదీ 07.09.2025 ఆదివారం వాసవి వారోత్సవములలో భాగంగా ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో సెక్టర్ 9 ఎంవీపీ కాలనీలో గల లెహెన్షెల్ఫ్ మానసిక దివ్యాంగుల కేంద్రమునందు ఉన్న పిల్లలకు సులువుగా అర్థమయ్యేటట్లు బోధించే ట్రైనింగ్ కిట్ తో పాటు బిస్కెట్లు మరియు మిఠాయిలు ప్రిన్సిపాల్ మేడం గారు అయిన కృష్ణవేణి గారికి క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు మరియు ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తాలు కలసి మానసిక కేంద్రంలో సహా ఉద్యోగుల సమక్షంలో బహుకరించడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్త, గోగుల నర్సింగరావు, గ్రంధి కృష్ణారావు, పూర్వపు కోశాధికారి హరగోపాల్ పాల్గొన్నారు.