వాసవి వారోత్సవాలలో భాగంగా గురువులకు సన్మానం. వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ చార్టర్ ప్రెసిడెంట్ వాసవి యన్ చెరుకు కృష్ణ దంపతులకు గణ సన్మానం. వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో విస్తృత సేవలు.

జై వాసవి.. జై జై వాసవి... విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవి వారోత్సవం. లలో భాగంగా ఈ దినం 05.09.2025 శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం వాసవి సేవా ఉద్యమంలో గురువుగా అంతర్జాతీయ వాసవి క్లబ్స్ , విశాఖపట్నం జిల్లా (వి 201ఏ )వాసవి క్లబ్స్ వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ లలో గత 15 సంవత్సరాల నుండి నిర్విరామంగా, ఫలాపేక్ష లేకుండా సేవా తత్పరతకు ఒక ఉదాహరణగా వాసవి క్లబ్స్ అన్నింటికీ ఒక పనిముట్టుగా అకుంఠిత దీక్ష, పట్టుదల తో కూడిన నిగర్వి , మృదు మదుర భాషి, స్నేహశీలి, వాసవి క్లబ్స్ సభ్యుల అందరి హృదయాలలో అనునిత్యం ఉండే వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ చార్టర్ ప్రెసిడెంట్ వాసవియన్ చెరుకు కృష్ణ కి వారి స్వగృహం నందు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు నిర్వహణలో కృష్ణ దంపతులకు సాలువతో సత్కరించి స్వీట్లు,పండ్లు బహుకరించడమైనది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికార చంద్రశేఖర్ గుప్త, ప్రోగ్రాం చైర్మన్ శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, గ్రంధి కృష్ణారావు, గోగుల నర్సింగరావు, పూర్వపు కోశాధికారి హరగోపాల్ పాల్గొన్నారు..