జర్నలిస్టులు ఆరోగ్యం పై దృష్టి సారించాలి. వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి.., విశాఖ నగర సీపీ శంకు బ్రత భాగ్జీ

పాత్రికేయులు ఆరోగ్యంపై దృష్టి సారించాలి విశాఖ సిటీ,(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) *- ఆరోగ్యం, ఆదాయం ఉంటేనే భవిష్యత్తు* - *వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి* *ఎస్సీఆర్డబ్ల్యూఏ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పిలుపు* *(విశాఖపట్నం, సెప్టెంబర్ 28)* విధి నిర్వహణలో ఒత్తిడితో పని చేసే పాత్రికేయులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో పాత్రికేయులు గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు తనను తీవ్రంగా కలచి వేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పౌర గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఆరోగ్యం, ఆదాయం ఈ రెండు అంశాల పై పాత్రికేయులు దృష్టి సారించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా రావడంతో పాత్రికేయ పని ఒత్తిడి తీవ్రమైంది అన్నారు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ 2016 లో స్థాపించిన ఈ సంస్థ దిన దిన ప్రవర్తమానమై పాత్రికేయులకు, ప్రజలకు ఎంతగానో చేరువైందని చెప్పారు. వృత్తి నైపుణ్యం కోసం కార్యశాలలు, సభ్యుల మానసిక ఆనందం నిమిత్తం సాహస క్రీడలు సహా సంక్షేమ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ నూతన కార్యవర్గం రెండేళ్ల పాటు పదవిలో ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియాకు చెందిన స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ నాగనబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ అశోక్ కుమార్ నేతృత్వంలో పదేళ్ల క్రితం ఆవిర్భవించిన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనతి కాలంలోనే జర్నలిస్టులకు చేరువైందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, సాహస క్రీడలు, కార్యశాలలు ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఈ సంస్థ అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ప్రజాకవి,సీనియర్ జర్నలిస్ట్ మజ్జి దేవిశ్రీ తన పాటలతో ఎస్సీఆర్డబ్ల్యూఎ నూతన కార్యవర్గ సభ్యుల్లో చైతన్యం నింపారు. అనంతరం ముఖ్య అతిథి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులందరినీ ఉచిత రీతిన సత్కరించారు. నాయకత్వంలో ఉన్న వారందరికీ గుర్తింపు కార్డులు అందజేశారు. *స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (scrwa) నూతన కార్యవర్గం - 2025* *గౌరవ సలహాదారులు* నాగబోయిన నాగేశ్వరరావు బి.ఎస్. చంద్రశేఖర్ మజ్జి దేవి శ్రీ *అధ్యక్షులు* బంగారు అశోక్ కుమార్ (వార్త) *ఉపాధ్యక్షులు* M. వెంకట సూరి అప్పారావు (సాక్షి) P. రవికుమార్ (సాత్వి) B. శిరీషా(ఆంధ్రప్రభ) G. శ్రీనివాసరావు (ఆంధ్రజ్యోతి) M.p.a రాజు(న్యూస్ 20 20) P. హేమ సుందర్ (వార్త) *జనరల్ సెక్రెటరీ* N. అశోక్ రెడ్డి (sdv న్యూస్) *ఆర్గనైజింగ్ సెక్రటరీస్* P. రవికుమార్ (నేత్రా న్యూస్) S.n.నాయుడు (సాత్వి) M. కృష్ణ కిషోర్ (ఈరోజు) M. రామచంద్ర రావు (10 TV) శ్రీనివాసరావు (కలం పోరాటం) *సెక్రెటరీస్* B. సతీష్ కుమార్ (ఆంధ్రజ్యోతి) N. అనీష్ కుమార్ (సాక్షి TV) V. గౌతమ్ (గ్రీన్ ఇండియా) S .చందు యాదవ్(సుమన్ టీవీ) L. గణపతిరావు (సాత్వి) K. రాంబాబు (ఆంధ్రప్రభ) K. విజయ్ కుమార్ (లీడర్) *జాయింట్ సెక్రెటరీస్* P. వసంత్ కుమార్ (సాత్వి) B.అమర్నాథ్ (సుమన్ టీవీ) R. ఎల్లేశ్వరరావు (వార్త) K. శ్రీనివాసరావు (సూర్య) A. అంజనీ కుమార్ (విజయభాను) K. స్వామి వినోద్ (అరుణ ప్రభ) దత్తు(మెగా 9 న్యూస్) *ట్రెజరర్* K . సత్యనారాయణ (పబ్లిక్) *ఎగ్జిక్యూటివ్ మెంబర్స్* M. ధర్మజ్యోతి (baaji news) A. రోజా (విజన్) P. పవన్ సాయి (వైజాగ్ లోకల్ న్యూస్) S. సంతోష్ కుమార్ (సాత్వి) B. జయరాం (HM tv)