జర్నలిస్టులకు అండగా ఉంటా, కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలి.జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ. జర్నలిస్టులు సమస్యలపై పది సంవత్సరాల క్రితం విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసాం, మళ్లీ తీయడానికి త్వరలో కార్యాచరణ.. సిద్ధం చేస్తాం . ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు. నేతలు గంట్ల శ్రీనుబాబు,నారాయణ, ఇర్రోతి ఈశ్వరరావు. .

అంగరంగ వైభవంగా జర్నలిస్టులు దసరా సంబరాలు. (విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) పండగ విశిష్టతను చాటిచెప్పిన సాంస్కృతిక పసందు. *పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాల్సిందే* *విజయవాడ వేదికగా త్వరలో భారీ ర్యాలీ* అక్కయ్యపాలెం సెప్టెంబరు 28 రాష్ట్రంలో ప్రజలందరి పైన ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని.. ప్రతి ఒక్కరు ఆ జగన్మాత కరుణ కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు బొలిశెట్టి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఆదివారం సింకా గ్రాండ్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొలిశెట్టి మాట్లాడుతూ నిరంతరం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఆటవిడుపుగా దసరా సంబరాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిందేనన్నారు. ఇందుకోసం తనవంతు సహకారం అందిస్తానని, అవసరం అయితే వారితో కలిసి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అయినా తాను సిద్ధమేనన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్రప్రధాన కార్యదర్శి గంగవరపు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి నిబద్ధతతో కట్టుబడి గట్టిగా కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని, ఇలా అయితే సమీప భవిష్యత్తులో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. దేశంలోని పలు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సంక్షేమానికి మంచి ప్రాధాన్యత నిస్తూ జర్నలిస్ట్ వృత్తిని బాగా ప్రోత్సహిస్తున్నా రన్నారు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కయిన అక్రెడిటేషన్ కార్డుల సాధనే జర్నలిస్టులకు తలకు మించిన భారంగా పరిణమించిన విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడటమంటే కత్తి మీద సామేనని తమకు తెలుసునని, అయినా జర్నలిస్టుల సంక్షేమం కోసం గట్టిగా కృషి చేస్తామని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే విజయవాడ వేదికగా అతిపెద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.. దసరా సంబరాలకి అధ్యక్షత వహించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు మాట్లాడుతూ సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల వద్దకు వచ్చే సరికి మాత్రం మొండి చెయ్యి చూపుతున్నాయన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని,, 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు పెన్షన్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చెయ్యాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు, కూటమి నాయకులకు, అధికారులకు ఇచ్చామని ఇంకా దశల వారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు . ప్రతి ఆట మాదిరిగానే దసరా పర్వదిన వేడుకలను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో నృత్య భారతి డాన్స్ స్కూల్ అసోసియేషన్ అధినేత్రి కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరింప చేశాయి. వెంకటేశ్వర వైభోగం.. నవదుల మహత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులకను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు చీరలు, పిల్లలకు రకరకాల బహుమతులు, మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హైదర్ ఆలీ సింకా ,, ఏపీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ..ఈశ్వరరావు, ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు.. బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఈరోతి ఈశ్వర రావు మదన్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, ఫెడరేషన్ డిప్యూటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ. సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి..రవికుమార్,, బండారు శివప్రసాద్, పక్కివేణు, నారాయణరాజుతో పాటు అసోసియేషన్ సభ్యులంతా పాల్గొన్నారు..