దుర్గాదేవి శరన్నవరాత్రులలో భాగంగా ప్రత్యేక పూజలు చేసిన చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షరాలు సిరమ్మ, అన్న సమారాధన ప్రారంభోత్సవం చేసిన సిరమ్మ.
September 27, 2025
దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అన్న సమారాధనలో మన సిరమ్మ.
భీమిలి నియోజకవర్గం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
విజయనగరం, నగర పాలక సంస్థ పరిధి లోని అశోక్ నగర్ లోని పైడితల్లమ్మ గుడిఎదురుగా జరుగుతున్న దుర్గాశరన్నావరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం జరిగిన అన్నసమా రాధన కార్యక్రమంనకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ
పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. దుర్గా శరన్న వరాత్రి ఉత్సవ కమిటీ ఆహ్వానంతో అక్కడికి చేరుకున్న సిరమ్మను ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి , కండువా తో ఆమెను సత్కరించారు. అనంతరం ఆమె అక్కడకు వచ్చిన భక్తులకు స్వయంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం పుష్కర శర్మ ఆధ్వర్యం లో జరిగింది.
అనంతరం ఆమె మాట్లాడుతూ దుర్గా దేవి అనంతమైన శక్తీ గల అమ్మవారని ఆమెను భక్తి శ్రద్దలతో కొలిస్తే మంచి ఫలితాలుంటాయని అన్నారు . విజయనగరం జిల్లా వాసులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని
ఆమె అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, దుర్గాదేవి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.