ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన కె.వి.ఆర్ కు ఘన సన్మానం,. కె.వి.ఆర్ సమాజానికి చేసిన సేవలను కొనియాడిన వక్తలు ..

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు సమాజ సేవ కోసం ఎనలేని కృషిచేసిన మాస్టర్ కంది వెంకటరమణ అందరికీ ఆదర్శప్రాయుడని విశ్రాంత జిల్లా విద్యా శాఖాధికారి మీసాల సూర్యనారాయణ కొనియాడారు. మంగళవారం ఉదయం వెంకటరమణ మాస్టర్ పదవీ విరమణ సందర్భంగా విజయనగరం జిల్లా, జామి మండలం, భీమసింగి సంజీవి కన్వెన్షన్ హాల్ లో పూర్వవిద్యార్థులు మరియు తెలగాపాలెం, సోమయాజులపాలెం,కంది శ్రీరామపురం,భీమసింగి గ్రామప్రజలు ఏర్పాటుచేసిన పౌర సన్మాన కార్యక్రమంలో విశ్రాంతి జిల్లా విద్యాశాఖాధికారి మరియు APC మీసాల సూర్యనారాయణ ముఖ్యఅతిదిగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాండ్రంకి సంజీవి, ZPTC గొర్లెరవికుమార్, APP అల్లు సత్యాజి,, గ్రామ సర్పంచి జొన్నాడ వెంకటలక్ష్మి,, ఎంపీటీసీ ధనియాల హైమవతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అస్సోసియేట్ ప్రెసిడెంట్ పువ్వల శ్రీనివాసరావు, కేవా ప్రెసిడెంట్, సైలాడ ఈశ్వరరావు, జిల్లా BC OBC ప్రెసిడెంట్ చింతల వెంకట సతీశ్,, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్ వెంకటేశ్వరరావు,,,పూర్వ విద్యార్థులు జూరెడ్డి శ్రీనివాసరావు,విజినిగిరి అప్పలరాజు,మానం శ్రీను,గుండాల శ్రీను, తదితరులు నిర్వహించిన కార్యక్రమంలో DPRTU, యూటీఫ్ నాయకులు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు,నాలుగు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.అధిక సంఖ్యలో పాల్గొని వెంకటరమణ ఉపాధ్యాయ వృత్తికి,సమాజ సేవకు,తెలగపాలెం గ్రామ అభివృద్ధికి, ప్రజా సంఘాల ఏర్పాటు చేసి అప్పట్లో నెహ్రూ యువక కేంద్రo కోఆర్డినేటర్ చిన్న తాతయ్య లు ఇచ్చిన ప్రోత్సాహం తో గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. భీమసింగి కాజ్ వే నిర్మాణానికి అంకుటితదీక్షతో కృషిచేసారని వక్తలు కొనియాడారు. ప్రధానంగా యువతకు విద్యార్థులకు విద్యతో పాటు,సమాజ సేవ, భక్తి వంటి సేవా కార్యక్రమాలు అలవాటు చేసి వారిలో ప్రేరణ చేకూర్చాలని పేర్కొన్నారు. ఐక్యమత్యంతోనే సమస్యల పరిష్కారం అవుతాయని ఆయన ఏ ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో సంఘాలు ఏర్పాటు చేసేవారు. ఏ రకంగా చూసుకున్న సమాజానికి ఉపయోగపడే విధంగా తన కార్యక్రమాలు రూపొందించుకొని తన శక్తి మేరకు కృషి చేయడంలో ఎటువంటి సందేహం లేదని వక్తలు కొనియాడారు.. జామి మండలం( లాయర్ సత్యాజి జామి ) మరోముఖ్య అతిథిఏపీపీ అల్లు సత్యాజి మాట్లాడుతూ కెవిఆర్ మాస్టర్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. కె.వి.ఆర్ మంచిని చాలా లేటుగా తెలుసుకున్నానని అటువంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరమని పేర్కొన్నారు. భీమ సింగి పెద్దాయన మాజీ సర్పంచ్
పాండ్రంకి సంజీవి మాట్లాడుతూ సమాజ సేవ కోసం కె.వి.ఆర్ చిన్నప్పటి నుండి కృషి చేస్తున్నారని అందర్నీ భాగస్వామి చేసుకుని ముందుకు నడవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. అప్పటి నెహ్రూ యొక్క కేంద్ర కోఆర్డినేటర్ చిన్న తాతయ్యలు ఇచ్చిన స్ఫూర్తితో కె.వి.ఆర్ మరింత అడుగులు ముందుకు వేసి ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. కాన్వెంట్లు స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారని పేర్కొన్నారు. అటు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో ఆయన విద్యార్థులకు విద్య నేర్పడంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రజల్లో అవేర్నెస్ పెంచి ఆ గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పలువురు వక్తలు కెవిఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సన్మానంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని ఘన సన్మానం చేశారు. పూల దండలతో ముంచెత్తారు. చివరగా కె.వి.ఆర్ తాను లాయర్ గా వృత్తిని చేపడతానని న్యాయం వైపు నిలబడి పేదలకు సహాయ పడతానని పేర్కొన్నారు.