దసరా పండగ పూర్తి అయినంత వరకు తోపుడు బండ్లు పై చిల్లర వర్తకులు వ్యాపారం చేసుకోండి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకూడదు. మళ్లీ బడ్డీలు పెడితే వాటిని తీసేస్తా o.. బాధితులకు న్యాయం చేస్తాం.. జోన్ 2 కమీషనర్ కె.కనకమహాలక్ష్మి

వర్తకులు ఆందోళన కొనసాగింపు, తోపుబండ్లు పై వర్తకం కు జోనల్ కమిషనర్ హామీ.. భీమిలి నియోజకవర్గo (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మాన0 శ్రీను మధురవాడ.) సి ఐ టీ యు ఆధ్వర్యంలో చిరు వర్తకులు ఆందోళన గురువారం మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద కొనసాగించారు.పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.. ఈ సందర్భంగా సి ఐ టీ యు నాయకులు డీ అప్పలరాజు, పీ రాజు కుమార్,వర్తక సంఘం నాయకులు మాట్లాడుతూ జీవీఎంసీ కమిషనర్ హామీమా ఉపాధిని కాపాడాలని కోరారు. పోలీసులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పీఎం పాలెం పోలీసులు . జోనల్ కమిషనర్ తో చర్చించారు.ఈ మేరకు చిరు వర్తకులు ప్రజలకు ఇబ్బంది లేకుండా తోపుడు బళ్ల పై వర్తకం చేసుకోవచ్చని జోనల్ కమిషనర్ కే కనక మహా లక్ష్మి ఆందోళనలో ఉన్న చిరు వర్తకులకు తెలిపారు.హాకర్ జోన్లు అందరికీ ఏర్పాటు చేస్తామని అప్పుడు ఆ జొన్లకు ఈ వ్యాపారులు అందరూ వెళ్ళ వలసి ఉంటుందని అన్నారు. బడ్డీలు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. అదే సందర్భంలో తోపుడుబండ్లను రోడ్లపై ఉంచకుండా,అమ్మకాలు పూర్తి అయిన తర్వాత ఎవరి బండి వారు తీసుకు వెళ్లాలని తెలిపారు.దసరా పండగ అయినంత వరకు కమిషనర్ ఆదేశాల మేరకు తొలగింపులు చేయడం లేదని తెలిపారు.ధర్నా చేస్తున్న వర్తకులు వద్దకు జోనల్ కమిషనర్ వచ్చీ వర్తకులతో మాట్లాడి ఈ విషయం చెప్పారు.అనంతరం ఆమె ఛాంబర్ లో కూడా వర్తక సంఘం, సి ఐ టీ యు నాయకుల తో మాట్లాడారు. కమిషనర్ వచ్చీ హాకర్ జోన్లు ఏర్పాటుకు స్థాలాలను పరిశీలించిన తర్వాత వర్తకులకు తెలియ పరుస్తామని,ఇప్పటికే చిరు వర్తకులు గుర్తింపు జరుగు తుందని తెలిపారు.ఈ ప్రకటన తరువాత ఆందోళన కారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తమకు సహకరించిన అధికారులు,పాత్రికేయులు,మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆదినారాయణ,ఈ రాంబాబు,కే సురేష్,పీ వరలక్ష్మి,తదితరులు చర్చలలో పాల్గొన్నారు. మధురవాడ అన్ని ప్రాంతాల వర్తకులు పాల్గొన్నారు.