విశాఖ ఏ సి ఏ వి డి సి ఏ,పి.ఎం పాలెం క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న ఎం వి వి సిటీ లో భగవాన్ శ్రీ సత్యసాయి సెంటర్లో స్వామి 100 రోజుల శతజయంతోత్సవాల్లో భాగంగా 100 గృహాలలో గృహనామ సంకీర్తన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామి దివ్య ఆశీస్సులతో ఆదివారం నిర్వహించిన వందనామ సంకీర్తనలు (100 భజనలుపుష్పాలు) ఘనంగా చేసి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్య సాయి సేవా సంస్థల జిల్లా ప్రెసిడెంట్ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు పాల్గొని మంగళ హారతి ఇచ్చిన అనంతరం 100 గృహాల సాయి భక్తులకు స్వామివారి 100 రోజుల జన్మదినం మెమెంటోలు అందజేశారు. సుమారు 300 సాయిభక్తులకు ప్రసాదం అందజేశారు.
October 26, 2025
విశాఖ సిటీ,మధురవాడ,ఎం. వి.వి. సిటీ,🌹 (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) ఓం శ్రీ సాయిరాం,
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంవీవీ సిటీ సాయి సేవా సెంటర్ ద్వారా సంకల్పించుకున్న 100 గృహనామ సంకీర్తనలు 24.11.2024 నుండి 25.11.2025 వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భమున తేదీ 26 10 2025 ఆదివారం ఎం వి వి సిటీ క్లబ్ హౌస్ - 1 ఆరవ ఫ్లోర్ నందు కిక్కిరిసిన భక్తుల నడుమ 100 భజనల నామ సంకీర్తన అత్యంత వైభవముగా జరిగినది. నామ సంకీర్తనలో ఎంవీవీ సిటీ నందు గృహనామ సంకీర్తన నిర్వహించుకున్న 100 మంది కుటుంబ సభ్యులు, సిటీ సమితి ప్రేమ సదన్ మందిరం, పీఎం పాలెం సమితి, మధురవాడ , సాగర్ నగర్ ప్రాంతములలో గల భక్తులు సుమారు 300 మంది పాల్గొన్నారు. ఈ వందమంది గృహనామ సంకీర్తనలు చేసుకున్న వారికి స్వామివారి లోగో చిత్రపటంతో కూడిన జ్ఞాపికను గృహస్తులు అందరికీ గుర్తుగా బహుకరించడమైనది. ఈ భజన కార్యక్రమము చివరగా అఖండజ్యోతిలతో 100 మంది మహిళలు చే మహా మంగళ హారతి ఇవ్వడం జరిగింది. తదనంతరం స్వామివారి ప్రసాదముతో పరిసమాప్తమైనది. ఎంవీవీ సిటీ సాయి సేవా సెంటర్ నిర్వాహకులు టంకాల జ్యోతి శివాజీ, నాగవేణి వెంకట రామకృష్ణ రావు పర్యవేక్షణ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ రాఘవరావు, జిల్లా అధ్యక్షులు పి.ఆర్.ఎస్.ఎన్ నాయుడు,జిల్లా ఆధ్యాత్మిక జాయింట్ కోఆర్డినేటర్ బి.వి రమణ, పీఎం పాలెం సమితి కన్వీనర్ ప్రభాకర్ పాల్గొన్నారు. 11 నెలలు పాటు జరిగిన ఈ 100 గృహనామ సంకీర్తనలలో సుమారుగా 4,000 మంది భక్తులు పాల్గొన్నట్లుగా , వారికి ఈ సంవత్సరం కాలం పాటు ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన అందరికీ సాయి సెంటర్ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు..



