శ్రీ లక్ష్మీనరసింహస్వామి క రావలంబ స్తోత్రపూజ విశిష్టత ప్రయోజనాలు వివరించిన వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ అమర్నాథ్.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) వాసవి క్లబ్,గ్రేటర్ విశాఖ కపుల్స్ వారు సోమవారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కరావలంబ స్తోత్ర పూజ ని అతి ఘనంగా శ్రీ షిర్డీ సాయి బాబా దేవాలయం,సీతమ్మధార నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జిల్లా గవర్నర్ అమర్నాథ్ పాల్గొనిఈ కరా వ లంబ స్తోత్రం పూజ విశిష్టతను, ప్రయోజనాలను భక్తులకు తెలియచేశారు. క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ రజనీ,కార్యదర్శి స్వప్న కోశాధికారి రాధిక గార్ల ఆధ్వర్యంలో రచన,నాగమణి,రేఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోసభ్యులు, భక్తులు ఇంత ఘనంగా నిర్వహించి నందుకు వారిని కార్యకర్తలను అభినందించారు.