వరదా ఈశ్వర హేమంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ వద్దగల ఏ యు డి టి లో నిరాశ్రయులైన వయోవృద్ధులకు అన్నదానం.
October 24, 2025
జై వాసవి.. జై జై వాసవి
విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ .: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో
వాసవియన్ వరదా ఈశ్వర హేమంత్ కుమార్ పుట్టినరోజు సందర్బంగా తేదీ 24.10.2025 న మధ్యాహ్నం TSR కాంప్లెక్స్ (opp. వైభవ్ జ్యువలరీ) లో ఉన్న AUDT లో నిరాశ్రయులైన 95 మంది వయోవృద్దులకు భోజన సదుపాయము ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, కోశాధికారి చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ, పూర్వపు అధ్యక్షులు గ్రంధి కృష్ణారావు, క్లబ్ సభ్యులు కోటేశ్వరరావు, *దాత: హేమంత్ కుమార్, మరియు వరద కామేశ్వరమ్మ* వారి స్నేహితులు పాల్గొన్నారు.

