డయాబెటిక్ నియంత్రించే ఐ కాఫీ షాప్ ప్రారంభించిన పీఎం పాలెం ఎస్ఐ భాస్కరరావు. యుజెఎఫ్ అధ్యక్షులు విశాలాంధ్ర వర్మ, 7వ వార్డు కార్పొరేటర్ భర్త పిల్లా వెంకటరావు
October 10, 2025
మధురవాడ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
ఆరోగ్యాన్నిచ్చే ఐ కాఫీ జీవీఎంసీ 7వ వార్డు పరిధి మిథిలాపూర్ కాలనీలో షాపు ప్రారంభం ____ప్రఖ్యాతిగాంచిన ఇండస్ వివా
ఉత్పత్తుల్లో భాగంగా ఐ కాఫీ మంచి ఆదరణ పొందింది. ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తున్న ఇండస్ వివా సంస్థ డయాబెటిక్ ఉన్న వారికోసం ఐ కాఫీ ని అందుబాటులోకి తెచ్చింది. మధుమేహాన్ని నియంత్రించే ఐ కాఫీ తో పాటు అరకు కాఫీ, సాధారణ కాఫీ లభ్యమయ్యే కాఫీ షాప్ ను శుక్రవారం మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ప్రారంభించారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు డా. ఎం. ఆర్. ఎన్. వర్మ, టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పి .వెంకట్రావు, సబ్ ఇన్స్పెక్టర్ కె భాస్కరరావు, పాస్టర్ క్రిస్టోఫర్, సిస్టర్ దయామణి కాఫీ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు అధినేత ఆర్, కనకరాజు మాట్లాడుతూ తమ వద్ద లభ్యమయ్యే ఐ కాఫీ షుగర్ వ్యాధిని నియంత్రిస్తుందని అన్నారు. ఏకనాయకం అనే వనమూలిక తో తయారు చేయబడే ఆయుర్వేద ఐ కాఫీ ఆరోగ్యపరంగా మేలు చేస్తుందన్నారు. తమ వద్ద ప్రసిద్ధి చెందిన అరకు కాపీ, నాణ్యమైన సాధారణ కాపీ కూడా దొరుకుతుందని వివరించారు. కాఫీ షాపును ప్రారంభించిన ప్రముఖులు మాట్లాడుతూ నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ కనకరాజు వ్యాపార పరంగా కూడా సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు.